Amitabh Bachchan-Rajinikanth: రజినీ స్టార్ కాదు.. సూపర్ స్టార్.! 30 ఏళ్ల కిందటి ముచ్చట చెప్పిన అమితాబ్

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఎంత స్టైల్ గా కనిపిస్తారో బయట అంతే సింపుల్ గా కనిపిస్తారు. భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఒకరైన రజనీ నిజ జీవితంలో చాలా సామాన్యుడిలా జీవిస్తారు. సాధారణ దుస్తులు ధరిస్తారు. మారువేషంలో.. బస్సులు, పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపిస్తుంటారు. రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఇప్పటికే అనేక కథనాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Amitabh Bachchan-Rajinikanth: రజినీ స్టార్ కాదు.. సూపర్ స్టార్.! 30 ఏళ్ల కిందటి ముచ్చట చెప్పిన అమితాబ్

|

Updated on: Sep 25, 2024 | 12:00 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో ఎంత స్టైల్ గా కనిపిస్తారో బయట అంతే సింపుల్ గా కనిపిస్తారు. భారత దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో ఒకరైన రజనీ నిజ జీవితంలో చాలా సామాన్యుడిలా జీవిస్తారు. సాధారణ దుస్తులు ధరిస్తారు. మారువేషంలో.. బస్సులు, పార్కుల్లో తిరుగుతూ వార్తల్లో కనిపిస్తుంటారు. రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఇప్పటికే అనేక కథనాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ప్రముఖ నటుడు, లెజెండ్ అమితాబ్ బచ్చన్ తాను చూసిన రజనీకాంత్ సింప్లిసిటీ గురించి గుర్తు చేసుకున్నారు. స్టార్ డమ్ వచ్చిన తొలినాళ్లలో రజనీకాంత్ తమిళంలోనే కాకుండా కన్నడ, తెలుగు, అలాగే కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం రజనీకాంత్ తనతో కలిసి హిందీ సినిమాల్లో నటించినప్పుడు ఎలా ఉండేవారో అమితాబ్ బచ్చన్ వివరించారు.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన చిత్రం ‘వెట్టేయన్’. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఈ దిగ్గజ నటులు మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే వెట్టేయాన్ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్ హాజరుకాలేదు కానీ తన వాయిస్ నోట్ పంపారు. ఇది షోలో ప్లే చేశారు.. ఇక ఆ వీడియోలోనే.. ‘హమ్’ సినిమా షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు రజనీకాంత్ విరామ సమయంలో నేలపై పడుకునేవారని చెప్పారు. తాను మాత్రం తన ఏసీ వాహనంలో పడుకునేవాడినని అన్నారు. అయితే రజనీకాంత్ నేలపై పడుకోవడం చూసి తాను కూడా.. ఏసీ వాహనం నుంచి బయటకు వచ్చానన్నారు అమితాబ్‌. అందుకే రజనీకాంత్ .. స్టార్ కాదు.. అందరికంటే సూపర్ స్టార్ అంటూ ప్రశంసించారు అమితాబ్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us