Pankaj Tripathi: పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.

Pankaj Tripathi: పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.

Anil kumar poka

|

Updated on: Apr 23, 2024 | 11:17 AM

బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితమే ఆయన తండ్రి కన్నుమూశారు. దీని నుంచి తేరుకోకముందే పంకజ్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పంకజ్ త్రిపాఠి బావమరిది రాకేశ్ తివారీ ఘోర కారు ప్రమాదంలో కన్నుమూశాడు. ఇదే ప్రమాదంలో గాయపడిన పంకజ్ త్రిపాఠి సోదరి సరిత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొన్ని నెలల క్రితమే ఆయన తండ్రి కన్నుమూశారు. దీని నుంచి తేరుకోకముందే పంకజ్ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. పంకజ్ త్రిపాఠి బావమరిది రాకేశ్ తివారీ ఘోర కారు ప్రమాదంలో కన్నుమూశాడు. ఇదే ప్రమాదంలో గాయపడిన పంకజ్ త్రిపాఠి సోదరి సరిత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకెళితే.. భార్యతో కలిసి ప్రత్యేక వాహానంలో బిహార్‌ నుంచి పశ్చిమ బెంగాల్ కు బ‌య‌లుదేరాడు రాకేష్. ఢిల్లీ – కోల్‌కతా జాతీయ రహదారిపై వారు వేగంగా ప్రయాణిస్తుండ‌గా.. అది చౌరస్తా మలుపు దగ్గర కారు అదుపు తప్పింది. వేగంగా వెళ్లి డివైడర్ ను బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు రాజేష్ తివారీ, సరితకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఇరుక్కున్న వారిని స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. ప్రమాదం తర్వాత రాజేష్ తివారీ, సరితా తివారీలను ధన్‌బాద్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికి రాజేష్ తివారీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సరితా తివారీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పంకజ్ త్రిపాఠి ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!