Sreeja Konidela: గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

Sreeja Konidela: గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Apr 23, 2024 | 11:12 AM

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక రకంగా సంబంధమున్నవారే. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. అయితే చిన్న కూతురు శ్రీజ కొణిదెల మాత్రం చాలా డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీకి ఆమె చాలా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవితోనే తన పిల్లలతో కలిసి ఉంటోన్న ఈ మెగా డాటర్.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ లోకి అడుగు పెట్టింది.

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా ఇండస్ట్రీతో ఏదో ఒక రకంగా సంబంధమున్నవారే. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంది. అయితే చిన్న కూతురు శ్రీజ కొణిదెల మాత్రం చాలా డిఫరెంట్. సినిమా ఇండస్ట్రీకి ఆమె చాలా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవితోనే తన పిల్లలతో కలిసి ఉంటోన్న ఈ మెగా డాటర్.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ లోకి అడుగు పెట్టింది. దీనికి సంబంధించి ‘కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది శ్రీజ. హైదరాబాద్ లో స్టూడియో అనంత పేరుతో ఒక ఫిట్ నెస్ సెంటర్ ను ప్రారంభించింది శ్రీజ. ఇందులో మనసుకు, శరీరానికి ప్రశాంతత కలిగించేలా జిమ్, యోగా, ఇతరత్రా కార్యక్రమాలన్నీ ఉంటాయట. ఓపెనింగ్ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనా కాసాండ్రా, బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్ శిల్పాశెట్టి ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.ఈ సందర్భంగా ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లో తను కూడా భాగమైనందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉందని శ్రీజ తన ఇన్ స్టాలో స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. ఈ సెంటర్‌లో జిమ్, యోగా లాంటివి ఉంటాయని తెలుస్తోంది. తనకు తెలిసిన కొంత మందితో ఈ ఫిట్ నెస్ స్టూడియోను శ్రీజ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!