Bigg Boss Telugu 9: తారుమారైన ఓటింగ్.. ఊహించని కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో..తొమ్మిదో వారం మధ్యలోకి వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే 9 మంది ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోగా, ప్రస్తుతం హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ కు ఏడుగురు నామినేట్ అయ్యారు.
భరణి శంకర్, సాయి శ్రీనివాస్, తనూజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి, రాము రాథోడ్, సంజన గల్రాని 7 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ కూడా జరుగుతోంది. ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు మాత్రమే ఈ వారం ఓటింగ్ కు సమయం ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ఎప్పుడూ టాప్ లో నిలిచే తనూజ ఈ వారం సెకెండ్ ప్లేసుకు పడిపోయింది. టాస్కుల్లో సత్తా చాటుతోన్న కల్యాణ్ పడాల ఇప్పుడు టాప్ ప్లేసుల కొనసాగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక తనూజ, కళ్యాణ్ విషయం పక్కకు పెడితే.. మూడో ప్లేసులో సీనియర్ హీరోయిన్ సంజన గల్రాని కొనసాగుతోంది. నాలుగో స్థానంలో సీరియల్ నటుడు భరణి శంకర్, హీరో సాయి శ్రీనివాస్ ఐదో ప్లేసులో ఉన్నారు. ఇక మరో టాప్ కంటెస్టెంట్ అయిన సుమన్ శెట్టి ఈ వారం ఓటింగ్ లో అనూహ్యంగా వెనుకబడుపోయాడు. ప్రస్తుతం అతను ఆరో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఏడో ప్లేసులో ఉన్నాడు. అంటే ప్రస్తుతం సుమన్ శెట్టి, రాము రాథోడ్ డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే రాము రాథోడ్ కే ఈ వారం ఎలిమినేషన్ గండం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే సుమన్ శెట్టికి హౌస్ మేట్స్ తో పాటు బయటి నుంచి కూడా గట్టి మద్దతు లభిస్తోంది. కాబట్టి అతను సేవ్ అయ్యే ఛాన్సు కనిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ
ఒకే వ్యక్తిని ఒకే నెలలో 7 సార్లు కాటేసిన పాము
Chittoor: అమ్మా.. నన్నెందుకిలా వదిలేశావ్.. జాలి కలగలేదా..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

