ChatGPT: ఇండియాలో చాట్ జీపీటీ.. ఫ్రీ ఫ్రీ ఫ్రీ
OpenAI భారత వినియోగదారుల కోసం సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. 2025 నవంబర్ 4 నుండి ప్రారంభమైన ఈ ప్రమోషనల్ ‘చాట్ జీపీటీ గో ప్లాన్’ను 12 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులు, ఫ్రీ టియర్ వినియోగదారులకు చాట్ జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది.
OpenAI భారత వినియోగదారుల కోసం సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. 2025 నవంబర్ 4 నుండి ప్రారంభమైన ఈ ప్రమోషనల్ ‘చాట్ జీపీటీ గో ప్లాన్’ను 12 నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ కొత్త వినియోగదారులు, ఫ్రీ టియర్ వినియోగదారులకు చాట్ జీపీటీ గో సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఉచిత ప్యాకేజ్ ద్వారా GPT-5 యాక్సెస్, అడ్వాన్స్డ్ ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్లోడ్, డేటా విశ్లేషణ టూల్స్, అలాగే కస్టమ్ ప్రాజెక్టులను సృష్టించే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. యూజర్లు వెబ్, ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. “ChatGPT Go” అనేది మిడ్-లెవల్ ప్లాన్. ఇది GPT-5 మోడల్‌ను ఉపయోగిస్తుంది. ఇది వేగవంతమైన, మరింత కచ్చితమైన, సున్నితమైన ప్రత్యుత్తరాలను అందిస్తుంది. గతంలో ఈ ప్లాన్ నెలకు రూ. 399 లేదా దాదాపు 5 US డాలర్లకు అందుబాటులో ఉండేది. భారతదేశం ఓపెన్ఏఐకి రెండవ అతిపెద్ద మార్కెట్. ఈ నేపథ్యంలో కంపెనీ తన AI టూల్స్‌ను ఇక్కడ విస్తరించే దిశగా ఈ చర్య తీసుకుంది. విద్య, వ్యాపారం, కోడింగ్, సృజనాత్మక ప్రాజెక్టుల కోసం చాట్‌జీపీటీని ఉపయోగించే లక్షలాది మంది భారతీయులకు ఈ ప్లాన్ ప్రయోజనం చేకూరుస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటర్లు, టెకీలు ఇలా అన్ని వర్గాలవారికి చాట్ జీపీటీ ఉపయోగపడుతుంది. ఇప్పటికే ChatGPT చాలా వెర్షన్లలో అందుబాటులో ఉంది.. అయితే ChatGPT Go వెర్షన్ ఇప్పుడు భారత్ లో ఉచితంగా లభిస్తోంది. భారత్ లో ChatGPT Go ఇక నుంచి ఉచితంగా అందించబడుతోంది. ఈ ఆఫర్ కొత్త, పాత యూజర్లకు వర్తిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకే వ్యక్తిని ఒకే నెలలో 7 సార్లు కాటేసిన పాము
Chittoor: అమ్మా.. నన్నెందుకిలా వదిలేశావ్.. జాలి కలగలేదా..
Kalki 2898 AD: కల్కి 2కి హీరోయిన్ ఫిక్సయినట్టేనా
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

