విష్ణుకు బ్రేకప్ చెప్పిన పృథ్వీ !! ఉన్న చోట ఉండక పుల్ల పెట్టిన యష్మి
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడూ ఏదోక లవ్ స్టోరీ కంటిన్యూ అవుతూనే ఉంది. కంటెస్టెంట్స్ మధ్యలో.. ఏదో ఒక ట్రాక్ నడుస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా విష్ణు ప్రియ, పృథ్వీ మధ్య కూడా ఒక లవ్ ట్రాక్ నడుస్తోంది. వీళ్లద్దరి కెమెస్ట్రీ చూసిన బీబీ ఆడియన్స్ ఇదే చెబుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. హౌస్‌లో రిమైనింగ్ కంటెస్టెంట్స్ కూడా ఇదే ఫీల్ అవుతున్నారు.
ఇక ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఇప్పుడు బ్రేకప్ జరిగింది. అందుకు యష్మి మాటలు కారణం కావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత … బిగ్ బాస్ హౌస్లోని సీరియల్ బ్యాచ్ మొత్తం ముచ్చట్లూ పెట్టుకుంటూ కూర్చుంది. ఇక ఆ గ్రూప్‌లోనే ఉన్న యష్మి.. విష్ణు, పృథ్వీ బాండింగ్ గురించి మాట్లాడింది. పృథ్వీని నేరుగా అడిగేస్తూ అతడికి సున్నితంగానే క్లాస్ తీసుకుంది. నీకు ఒక ఫ్రెండ్ గా చెబుతున్నాను.. నాకు మీ ఇద్దరిని చూసి విసుగొచ్చింది.. ఎక్కడ చూసిన మీరిద్దరే కలిసి కనిపిస్తున్నారు.. నీకు ఆమె స్పేస్ ఇవ్వట్లేదు.. అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు ఇది ఇండివిడ్యువల్ గేమని.. ఏదైనా ఉంటే బయట చూసుకుందాం అంటూ.. పృథ్వీకి చెప్పింది యష్మి. అంతేకాదు విష్ణు ప్రియ పృథ్వీకి ఫ్రెండా లేక… తనపై ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా అంటూ… పృథ్విని కనుక్కొంది. పృథ్వీ తను జస్ట్ ఫ్రెండ్ అని చెప్పే సరికి.. అయితే క్లియర్ గా ఆమెతో మాట్లాడు అన్నట్టు హింట్ ఇచ్చింది. దీంతో విష్ణు ప్రియ దగ్గరకు వెళ్లిన పృథ్వీ.. తనకు ఎలాంటి రిలేషన్ వద్దంటూ విష్ణుతో చెప్పాడు. తాను ఒంటరిగా ఉండడమే తనకు ఇష్టం.. అంటూ విష్ణు ప్రియకు క్లారిటీ ఇచ్చాడు. ఇక పృథ్వీ ని ఫాలో అవుతున్న బీబీ ఆడియన్స్… విష్ణుతో పృథ్వీ బ్రేకప్ చేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు యష్మినే కారణం అంటూ.. ఆమెను ఆడిపోసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క వీడియోతో.. అందరికీ మత్తు వదిలించిన రియా దొరికేసింది ??
ప్రభాస్ కళ్లద్దాలు చూసి కొనాలనుకునేరు.. వాటి ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!
డార్లింగ్ హీరోకు మెగా స్టార్.. క్రేజీ బర్త్‌డే విషెస్
అర రోజు కష్టపడితే.. భారీగా రెస్పాన్స్ !! ‘రోలెక్స్’ సినిమాపై సూర్య అప్డేట్