Bhola Shankar pre-release event: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కళావేదికలో జరుగుతోంది. మెహర్ రమేశ్ చాలా గ్యాప్ తరువాత దర్శకత్వం వస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమా భోళా శంకర్. ఈ సినిమా 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలిగా నటించింది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు . ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రయిలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.
అదిరే స్టైల్‌ని, పగిలే స్వాగ్‌ని పాటల్లో చూపించాలనుకున్నారు మెగాస్టార్. అందుకే మామూలుగా తన సినిమాలకు మ్యూజిక్ చేసే డైరక్టర్లను పక్కనపెట్టి మహతి స్వరసాగర్‌కి బాధ్యతలు అప్పగించేశారు. అందరికీ రాని అవకాశం అని తెలుసు కాబట్టి, భోళా మేనియాను, మెగా యుఫోరియాను తన బీట్స్ లో చూపించేశారు యంగ్ తరంగ్ మహతి. వాల్తేరు వీరయ్య విజయంతో భోళా శంకర్ సినిమాపై పై అంచనాలు పెరిగాయి.