Pawan Kalyan Birthday: జనం నచ్చిన హీరో.. దేశం మెచ్చిన నాయకుడు.. పవన్ గురించి మీకు తెలియని విషయాలు

తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. కొన్నాళ్లపాటు తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉండగా..ఆ సినిమాలు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan Birthday: జనం నచ్చిన హీరో.. దేశం మెచ్చిన నాయకుడు.. పవన్ గురించి మీకు తెలియని విషయాలు

|

Updated on: Sep 02, 2024 | 9:40 AM

తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. కొన్నాళ్లపాటు తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉండగా..ఆ సినిమాలు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించినట్లు తెలుస్తోంది. పవన్ కెరీర్‏లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రాల్లో వన్ ఆఫ్ ది మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ 56వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. most awaited re-release movie గబ్బర్ సింగ్ ఈ సందర్భంగానే స్పెషల్ షోస్ వేస్తున్నట్లు తెలుస్తుంది.

సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాను రీరిలీజ్ చేయనున్నారట. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేస్తున్నట్లు అనుశ్రీ ఫిలిమ్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఇన్నాళ్లు పవన్ సినిమాల విడుదలకై ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పక్కా స్పెషల్ ట్రీట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో రూ.150 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పరమేశ్వర్ ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేశ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. పవన్ మేనరిజమ్, డైలాగ్స్, యాక్షన్, మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఇప్పుడు మరోసారి రిలీజ్ కాబోతుందని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ చిత్రంలో నటిస్తున్నారు పవన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు పవన్. కొన్నాళ్ల క్రితం విడుదలైన టీజర్ సినిమాపై మరింత క్యూరియాసిటి కలిగించింది.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us