Mohanlal: ‘మోహన్‌లాల్ పిరికివాడు’ అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక కలకలం రేపుతోంది. మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్య గురించి ప్రస్తుతం సౌత్ ఇండియా మాత్రమే కాదు, నార్త ఇండియా కూడా మాట్లాడుకుంటోంది. మలయాళ ఇండస్ట్రీలో పెద్దల తీరుపై విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ రాజానామా చేయడం కూడా సంచలనంగా మారింది.
మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక కలకలం రేపుతోంది. మలయాళ సినీ ఇండస్ట్రీలో నటీమణులపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్య గురించి ప్రస్తుతం సౌత్ ఇండియా మాత్రమే కాదు, నార్త ఇండియా కూడా మాట్లాడుకుంటోంది. మలయాళ ఇండస్ట్రీలో పెద్దల తీరుపై విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ రాజానామా చేయడం కూడా సంచలనంగా మారింది. అయితే సంచలనం సద్దుమనగక ముందే.. అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ పిరికి వాడంటూ.. హీరోయిన్ పార్వతీ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌తో పాటు.. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. ఇప్పటికే ట్యాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ పార్వతీ.. అమ్మ సంస్థ నిర్వాహకుల షాకింగ్ కామెంట్స్ చేసింది. నిరంతర లైంగిక ఫిర్యాదుల నేపథ్యంలో మలయాళ నటీనటుల సంఘం అమ్మ నుంచి మోహన్‌లాల్‌తో సహా ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేయడం పిరికిపంద చర్య అని నటి పార్వతి విమర్శించింది.
ఓ ఇంటర్వ్యూలో అమ్మ అధ్యక్షుడి తీరుపై రియాక్టైంది. “ఈ వార్త వినగానే నేను షాక్ అయ్యాను. ఇది ఎంత పిరికితనం.. అంటే. ఈ విషయాన్ని మీడియాకు వివరించే స్థితిలో ఉన్న వాళ్లు పిరికితనంతో బాధ్యత నుంచి ఎలా తప్పుకుంటారు.? అని పార్వతి ప్రశ్నించింది. మలయాళ నటీనటుల సంఘంలోని వ్యక్తులు ఎలా పని చేస్తారో నాకు బాగా తెలుసు. అక్కడ మా అవసరాల గురించి మాట్లాడే హక్కు నాలాంటి నటీమణులకు లేదు. కాబట్టి ఈ పరిస్థితి మారాలంటే మెరుగైన నాయకత్వం అవసరం. రాబోయే కాలంలోనైనా ప్రతి ఒక్కరూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పుకొచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

