విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి

విశ్వంభర సెట్లో.. చిరంజీవి కలిసిన సినిమాటోగ్రఫీ మంత్రి

Phani CH

|

Updated on: Jun 21, 2024 | 7:51 PM

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ నియమితులయ్యారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ లో జరుగుతోన్న విశ్వంభర మూవీ సెట్ కి వెళ్లిన మంత్రి చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి కందుల దుర్గేష్ కు స్వాగతం పలికి శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు.

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ నియమితులయ్యారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్ లో జరుగుతోన్న విశ్వంభర మూవీ సెట్ కి వెళ్లిన మంత్రి చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి కందుల దుర్గేష్ కు స్వాగతం పలికి శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. విశ్వంభర సెట్లోనే సినీ పరిశ్రమ అభివృద్ధి, పరిష్కరించాల్సిన సమస్యలపై చిరంజీవితో చర్చలు జరిపారు మినిష్టర్ కందుల దుర్గేష్. అనంతరం మంత్రితో భేటీ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు చిరంజీవి. కందుల దుర్గేష్ తో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మెగాస్టార్ .. మిత్రుడు కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌పై ఆయనకు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉందంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి , ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు చిరు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది

గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!

‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి

పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు

త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులు