రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది

రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి.. ప్రారంభానికి ముందే కూలిపోయింది

Phani CH

|

Updated on: Jun 21, 2024 | 7:49 PM

బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అరారియా జిల్లాలో బక్రా నదిపై రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓ కాంక్రీట్ బ్రిడ్జి ప్రారంభించక ముందే కూలిపోయింది. నదీ ప్రవాహం పెరగడంతో కొంత భాగం కుప్పకూలింది. కూలిపోయిన భాగం నది మధ్యలో ఉండగా.. ఒడ్డున నిర్మించిన భాగం చెక్కుచెదరకుండా నిలబడింది. నదిపై బ్రిడ్జి ఓ వైపునకు ఒరిగి పోయిందనే సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

బీహార్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అరారియా జిల్లాలో బక్రా నదిపై రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించిన ఓ కాంక్రీట్ బ్రిడ్జి ప్రారంభించక ముందే కూలిపోయింది. నదీ ప్రవాహం పెరగడంతో కొంత భాగం కుప్పకూలింది. కూలిపోయిన భాగం నది మధ్యలో ఉండగా.. ఒడ్డున నిర్మించిన భాగం చెక్కుచెదరకుండా నిలబడింది. నదిపై బ్రిడ్జి ఓ వైపునకు ఒరిగి పోయిందనే సమాచారం అందుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లోనే బ్రిడ్జి కుప్పకూలి నీటిలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కుర్సకాంత, సిక్తి ప్రాంతాల మధ్య ప్రయాణ సౌలభ్యం కోసం ఈ బ్రిడ్జిని నిర్మించారు. కనీసం ప్రారంభోత్సవం కూడా జరకముందే బ్రిడ్జి కూలిపోవడంపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ విస్మయానికి గురయ్యారు. నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ బ్రిడ్జి కూలిపోయిందని, ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గల్ఫ్ లో ఉద్యోగమా? ఈ లెక్కలు, చిక్కులు చూడండి !!

‘స్కిన్‌ బ్యాంక్‌’.. దేశంలో తొలిసారి అందుబాటులోకి

పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు

త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులు

రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా వచ్చిన రైలు.. చివరికి ??