AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?వీడియో

‘దూకుడు’ మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?వీడియో

Samatha J
|

Updated on: Dec 07, 2025 | 2:10 PM

Share

దూకుడు కారణంగా అఖండ2 అయిపోయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది ఇప్పుడు. ఎందుకంటే 14 రీల్స్ , ఈరోస్ సంస్థ కలిసి దూకుడు.. సినిమాను నిర్మించింది. అయితే, ఆ సమయంలో 14 రీల్స్ సంస్థ.. ఈరోస్ సంస్థకి రూ.11 కోట్లు బకాయి పడింది. ఆ డబ్బును వెంటనే చెల్లించాలని అప్పట్లో మద్రాస్ హైకోర్టు 14 రీల్స్ సంస్థని ఆదేశించింది.

2019లోనూ చెన్నై హైకోర్టు ఈ విషయంలో మరోసారి స్పందిస్తూ.. పాతబకాయి మీద అయిన వడ్డీతో కలిపి మొత్తం రూ.27 కోట్లు చెల్లించాలని చెప్పింది. అయితే.. ఆ కేసు విచారణ జరుగుతుండగానే..14 రీల్స్ సంస్థ నుంచి బయటకు వచ్చిన నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట 14 రీల్స్ ప్లస్.. అనే పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. అదే సంస్థ అఖండ 2 సినిమాను తెరకెక్కించింది. తాజా వివాదం సందర్భంగా.. తమకు, 14 రీల్స్ కి ఎలాంటి సంబంధం లేదని, 14 రీల్స్ పాత ఆర్థిక లావాదేవీలకు తాము బాధ్యులం కామని.. 14 రీల్స్ ప్లస్ తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. తమ సినిమా విడుదల ఆగిపోతే.. బయ్యర్లు, థియేటర్ యాజమాన్యం నష్టపోతారని కూడా 14 రీల్స్ ప్లస్ కోర్టుకు తెలిపింది. కాగా, దీనిపై స్పందించిన ఈరోస్ సంస్థ.. కోర్టులో 14 రీల్స్, 14 రీల్స్ ప్లస్ ఒకటేనని వాదించింది. కాగా, కోర్టు ఆ వాదనను తోసిపుచ్చుతూ, అఖండ 2 సినిమాను రిలీజ్ కు అక్టోబర్ 30న స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో నిర్మాతలు రిలీజ్ పనుల్లో పడిపోయారు. ఈ క్రమంలో అనూహ్యంగా డిసెంబర్ 3న చెన్నై కోర్టులో ఈరోస్ సంస్థ.. పిటీషన్ వేసింది. తమ పాత కేసును మరోసారి విచారించాలని కోరింది. దాంతో, అఖండ 2 సినిమా వాయిదా అనివార్యం అయింది.

మరిన్ని వీడియోల కోసం :

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో