Samantha Struggles: రూ.500 ఇచ్చారు.. ఇంత దారుణమా.! ఎమోషనల్ అయిన సమంత.

Samantha Struggles: రూ.500 ఇచ్చారు.. ఇంత దారుణమా.! ఎమోషనల్ అయిన సమంత.

Anil kumar poka

|

Updated on: Jan 10, 2024 | 11:41 AM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సమంత ఒకరు. తక్కువ సమయంలోనే సమంత స్టార్ స్టేటస్ ను అందుకుంది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అక్కడ స్టార్ హీరోలైన దళపతి విజయ్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలకు జోడీగా నటించింది. ఇక బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. సినిమాల్లో రాణిస్తున్న టైం లోనే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఇక సామ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.. మయోసైటీస్‌ కారణంగా ప్రస్తుతం సినిమాలకు ఒక ఏడాది దూరంగా ఉంది సామ్.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సమంత ఒకరు. తక్కువ సమయంలోనే సమంత స్టార్ స్టేటస్ ను అందుకుంది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అక్కడ స్టార్ హీరోలైన దళపతి విజయ్, సూర్య, విక్రమ్ లాంటి హీరోలకు జోడీగా నటించింది. ఇక బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. సినిమాల్లో రాణిస్తున్న టైం లోనే అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. ఆతర్వాత ఈ ఇద్దరూ విడిపోయారు. ఇక సామ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.. మయోసైటీస్‌ కారణంగా ప్రస్తుతం సినిమాలకు ఒక ఏడాది దూరంగా ఉంది సామ్. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది సమంత. సమంత చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు సమంత మెంటల్ గా స్ట్రాంగ్ కావడం కోసం ట్రై చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ వేదిక పై సమంత తన బాల్యం గురించి.. సినిమాల్లోకి రాకముందు తన జీవితం గురించి తెలిపింది. తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది సామ్.

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను చూశాని అని తెలిపింది.. ఒక్క పూట భోజనం కోసం చాలా కష్టపడేవాళ్ళం..చిన్న తనం నుంచి నన్ను బాగా చదువుకో అని నా తల్లిదండ్రులు చెప్పేవారు అని తెలిపింది. తాను కూడా బాగా చదివేదాన్ని అని పై చదువులు చదవాలని అనుకున్నా కుటుంబ పరిస్థితి ఆర్ధిక పరిస్థితి సహకరించలేదు అని తెలిపింది. ఆ టైం లో ఏ పని దొరికితే ఆ పని చేశాను అని తెలిపింది. ఓ వైపు చదువుకుంటూనే పని చేసేదాన్ని అని తెలిపింది సామ్. చదువుకుంటూనే ఓ స్టార్ హోటల్ లో పని చేశాను అప్పుడు నాకు నెలకు 500 ఇచ్చేవారు. అదే నా మొదటి సంపాదన అని తెలిపింది సామ్.ఇదే విషయం సమంత ఫ్యాన్స్‌ను ఫీల్ అయ్యేలా చేస్తోంది. దారుణం అనే కామెంట్‌ నెట్టింట కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos