Jr.NTR Tag - Devara : యంగ్ టైగర్ కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌.! ట్యాగ్ మార్చుకున్న NTR.

Jr.NTR Tag – Devara : యంగ్ టైగర్ కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్‌.! ట్యాగ్ మార్చుకున్న NTR.

Anil kumar poka

|

Updated on: Jan 10, 2024 | 11:51 AM

యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ నటిస్తున్న నయా మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.

యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ నటిస్తున్న నయా మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలని అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దేవర సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు. ఆ క్రమంలోనే తాజాగా దేవర మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ గ్లింప్స్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న దేవర మూవీలో తారక్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన గ్లింప్స్‌తో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కారణం యంగ్‌ టైగర్‌కు ఉన్న ట్యాగ్ మారడమే. ఎస్ ! నిన్నటి వరకు యంగ్ టైగర్ అనే ట్యాగ్ తో తారక్ ఇప్పుడు ఆ ట్యాగ్ ను మార్చుకున్నారు. దేవర సినిమా టైటిల్ లో ఎన్టీఆర్ ట్యాగ్ మారింది. “మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్” అనే ట్యాగ్ తో రానున్నారు తారక్. ఈ పవర్ ఫుల్ ట్యాగ్ అభిమానులకు ఇప్పుడు ఫుల్ కిక్కిస్తోంది. నెట్టింట ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos