Guntur Karam Ticket Price: గుంటూరోడికి రేవంత్ ఫుల్ సపోర్ట్.! ఇక రవణగాడు ఆగడుగా..
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గుంటూరు కారం’ చిత్రయూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో 65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో 100 పెంచుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ప్రైజ్ ఒక్కటే కాదు... గుంటూరు కారం బెన్ ఫిట్ షోలు కూడా వేసుకోవచ్చని తెలిపింది రేవంత్ సర్కార్.
మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గుంటూరు కారం’ చిత్రయూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో 65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో 100 పెంచుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ప్రైజ్ ఒక్కటే కాదు.. గుంటూరు కారం బెన్ ఫిట్ షోలు కూడా వేసుకోవచ్చని తెలిపింది రేవంత్ సర్కార్. గుంటూరు కారం రిలీజ్ డేట్.. 12 ముందు రోజు జనవరి 11 అర్థరాత్రి ఒంటిగంట నుంచి రాష్ట్రంలో 23 చోట్ల బెన్ ఫిట్ షోలు వేసుకునేందుకు ప్రభుత్వం పరిమిషన్ ఇచ్చింది. అలాగే ఈ సినిమాను ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల నుంచి షో వేసుకోవచ్చు అని ప్రభుత్వం జీవో జారిచేసింది. అయితే ఈ న్యూస్.. అండ్ ప్రభుత్వ నుంచి రిలీజ్ అయిన జీవీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మహేష్ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos