WWEలో పాల్గొన్న రానా.. మొట్ట మొదటి ఇండియన్ సెలబ్రెటీగా హిస్టరీ..
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్నారు.లీడర్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన రానా.. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత పలు చిత్రాలతో మెప్పించిన రానా.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్నారు.
బాహుబలి చిత్రంలో భల్లాలదేవ పాత్రలో తనదైన నటనతో కట్టిపడేశారు. చివరగా సాయి పల్లవితో కలిసి విరాట పర్వం చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ప్రొడక్షన్ రంగంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. తాజాగా రానా WWE ఫేమ్ రెజ్లింగ్ మేనియాలో కనిపించాడు. రెజ్లింగ్ మేనియా 41 ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే ఈ రెజ్లింగ్ మేనియా పోటీలను చూసేందుకు రానా వెళ్లాడు. డబ్ల్యూడబ్ల్యూఈ చూసేందుకు వెళ్లిన మొట్ట మొదటి భారతీయ సెలబ్రెటీగా చరిత్ర సృష్టించారు రానా. అక్కడ రానా దిగిన పలు ఫోటోలను నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ రెజ్లింగ్ మేనియా లైవ్ లో చూడటానికి వెళ్లిన తొలి భారతీయ సినిమా సెలబ్రెటీగా రానా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక అక్కడికి వెళ్లడం గురించి రానా మాట్లాడుతూ.. “WWE 41లో ఉండడం అనేది అద్భుతమైన అనుభవం. WWE అనేది మనందరి బాల్యంలో ఒక భాగం. ఇప్పుడు దానిని ప్రత్యేక్షంగా చూడడం.. ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం.. ముఖ్యంగా WWE, రానా నాయుడు రెండింటిని నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం చేయడం సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు రానా.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెరుగులో ఒక్క చెంచా దీన్ని కలిపి తినండి.. మ్యాజిక్ లాగా పనిచేస్తుంది!
అలర్ట్.. వాట్సప్‌లో వచ్చే ఫోటోలు ఓపెన్ చేస్తే.. అంతే..
గ్రహాంతరవాసుల దాడి? రాయిలా మారిన సోవియట్ సైనికులు
అనంత్ అంబానీ బరువుకు కారణమేంటి..? కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్నా ఎందుకు తగ్గడం లేదు
విధులు ముగించుకొని వెళ్తున్న పోలీసులు.. దారిలో కనిపించిన సీన్ చూసి
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

