గుత్తాజ్వాల బిడ్డకు పేరు పెట్టిన అమీర్ ఖాన్.. ఒక్క సారిగా ఎమోషనల్ అయిన క్రీడాకారిణి
బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల , కోలీవుడ్ హీర విష్ణు విశాల్ ఇటీవలే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది ఏప్రిల్ లో గుత్తా జ్వాల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ గారాల పట్టి నామకరణ మహోత్సవం నిర్వహించారు గుత్తా జ్వాల దంపతులు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. ఆయనే గుత్తా జ్వాల కూతురికి పేరు పెట్టాడు.
ఈ విషయాన్ని హీరో విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆమిర్ తో కలిసి తన కుటుంబం దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో షేర్ చేశాడు. అయితే ఈ ఫోటోల్లో గుత్తా జ్వాలా ఏడుస్తూ కనిపించడం… ఆమెను భుజం తట్టి మరీ ఆమీర్ ఓదార్చం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. తన బిడ్డ నేమింగ్ సెర్మనీకి సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేసిన హీరో విష్ణు విశాల్… ఆ ఫోటోలతో పాటు.. తమ బేబీకి పేరు పెట్టడానికి హైదరాబాద్ వచ్చిన ఆమిర్‌ఖాన్ సార్ ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చాడు. ఆమిర్ సర్‌తో మా ప్రయాణం అద్భుతమని తన ట్వీట్లో కోట్ చేశాడు. ఇక ఈ విషయం కాస్త పక్కకు పెడితే… ఆమిర్ ఖాన్ గుత్తా జ్వాల కూతురికి మిరా.. అని పేరు పెట్టాడు. దీని అర్ధాన్ని కూడా విష్ణు విశాల్ తన పోస్టులో వెల్లడించాడు. మిరా అంటే శాంతి, షరతుల్లేని ప్రేమ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కుటుంబంతో ఆమిర్ ఖాన్‌కు మంచి అనుబంధం ఉంది. గతంలో.. తన తల్లికి చికిత్స చేయించే క్రమంలో ఆమిర్.. చెన్నైలోని విష్ణు విశాల్ ఇంట్లో నే ఉన్నాడు. ఇక ‘సితారే జమీన్ పర్’ విజయోత్సాహంలో ఉన్న ఆమిర్ ఇటీవల విష్ణు విశాల్ ఇంటికి వెళ్లారు. తన బేబీ నేమింగ్ సెర్మనీని అంటెడ్ అయ్యాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kubera: అప్పుడే OTTలోకి కుబేర మూవీ…
మళ్లీ ఆ తప్పు చేయను.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కలర్ ఫొటో డైరెక్టర్
రష్మికపై పని ఒత్తిడి.. బాధేస్తుందంటూ హీరోయిన్ ఎమోషనల్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

