ముందు మహేషే రాముడు !! కానీ ఆ ఇబ్బందితో పక్కకి..
రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తెరకెక్కుతోంది. రామాయణ్ పేరుతో వస్తోన్న ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే సీతమ్మగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ఇక రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్ యాక్ట్ చేస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మైథాలజీ మూవీకి దంగల్ ఫేమ్ నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.
సుమారు 1000 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మించారు. ఆయనతో హీరో యష్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ఇప్పటికే రామయాణ్ మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. దీనికి సినీ అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఇందులో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని ప్రశంసలు లభిస్తున్నాయి. ఇక రణ్ బీర్ కపూర్ లుక్‌కు బాగుందంటూ కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రామాయణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట బాగా వైరలవుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో రాముడి పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ స్టార్ హీరో మహేష్‌ను అనుకున్నారట. ఎస్ ! రామయణంలో రాముడి పాత్ర కోసం నితీష్ తివారీ కూడా మొదట మహేష్ కావాలని పట్టుబట్టారట. రామాయణం కథ, రాముడి పాత్ర గురించి మహేష్ తో కూడా నితీష్ చర్చించారట. మహేష్ కూడా ఈ సినిమాపై బాగానే ఆసక్తి చూపించారట. కానీ అప్పటికే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో ప్రాజెక్ట్ కు కమిటై పోవడంతో రామాయణం కోసం కాల్షీట్లు కేటాయించలేని పరిస్థితి తలెత్తిందట. దీంతో అయిష్టంగానే మహేష్ రామాయణ్ సినిమాను వదులుకున్నారట. అయితే ప్రస్తుతం ఇది రూమర్లు మాత్రమే. ఇందులో ఎంత నిజముందో చిత్ర బృందమే క్లారిటీ ఇవ్వాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడుస్తూ.. హీరోయిన్.. అయినా కానీ సెల్ఫీ కోసం అభిమాని తమషా
సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా
త్వరలో లక్కీ భాస్కర్2.. సీక్వెల్ పై హింట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

