యమూనా నదిలో విషపు నురగలు.. క్లీనింగ్‌కు చర్యలు.. వీడియో

దేశ రాజధాని ఢిల్లీ లో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. యమునా నదిలో నీటి పైన విషపు మురుగు పైకి తేలుతుంది. నీటిపైన చాలా భాగంలో ఈ విషపు నురుగు పైన తేలుతూ కనిపించడం కలకలం రేపుతోంది.దేశ రాజధాని ఢిల్లీ లో యమునా నది కాలుష్య కాసారంగా మారింది. యమునా నదిలో నీటి పైన విషపు మురుగు పైకి తేలుతుంది. నీటిపైన చాలా భాగంలో ఈ విషపు నురుగు పైన తేలుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కలింది కుంజ్‌ అనే ప్రాంతంలో ఈ విష పురుగు దర్శనమిచ్చింది. దీంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నదిని శుభ్రం చేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది. నురుగు తొలగించేందుకు 15 బోట్లు ఏర్పాటు చేశారు. కలింది కుంజ్ ప్రాంతంలో బోట్లతో నురుగును తొలగిస్తున్నారు. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ‘ఛఠ్ పూజ’ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇటు ఢిల్లీలోని కలింద్ కుంజ్ వద్ద యమునా నది ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు ప్రవహిస్తున్నాయి. వాటిని కూడా లెక్కచెయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు భక్తులు. యమునా నదిలో అమ్మోనియా స్థాయి పెరిగిందని ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా తెలిపారు. మరోవైపు 90 శాతం వ్యర్థ జలాలు యమునా నదిలోకి వెళ్తాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

Viral Video: ఎయిర్‌ హోస్టెర్సా మజకా !! డ్యాన్స్‌తో దుమ్ము లేపేశారు !! వీడియో

COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu