Puppy Dance: యజమాని ఎలా డ్యాన్స్ చేస్తే.. అలాగే చేస్తున్న కుక్కపిల్ల.. క్యూట్‌ డాన్స్‌.. వీడియో వైరల్‌

Puppy Dance: సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ పెంపుకు జంతువులు చేసే పనులను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కుక్కపిల్లలు,, పిల్లి పిల్లు చేసే..

Puppy Dance: యజమాని ఎలా డ్యాన్స్ చేస్తే.. అలాగే చేస్తున్న కుక్కపిల్ల.. క్యూట్‌ డాన్స్‌.. వీడియో వైరల్‌
Puppy Dance
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2021 | 5:02 PM

Puppy Dance: సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ పెంపుకు జంతువులు చేసే పనులను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా కుక్కపిల్లలు,, పిల్లి పిల్లు చేసే పనుల వీడియోలకు నెటిజన్లు ఫిదా. అవి తమ యజమానితో పాటు కలిసి చేసే ముద్దుముద్దు పనులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తమ మనసుకు సంతోషాన్ని ఇస్తే వాటి పనులను హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కుక్క పిల్లలు చూడ్డానికి ఎంతో క్యూట్‌గా ఉంటాయి. ఆ క్యూట్‌ నెస్‌కి ఫిదా అయ్యే చాలామంది వాటిని పెంచుకుంటారు. పెట్స్‌ అంటే ఇష్టపడేవారు వాటితో ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. ఇక కుక్క పిల్లలకు చిన్నప్పటినుంచి మనం ఏం నేర్పిస్తే అవే నేర్చుకుంటాయి. అలాంటి వీడియోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అచ్చం అలాంటి వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో ఒక కుక్కపిల్ల తన యజమాని ఎలా డ్యాన్స్‌ చేస్తే తాను అలానే చేస్తోంది. సదరు యజమాని ఏ విధంగా గత్తులేస్తూ డ్యాన్స్‌ చేస్తున్నాడో అది తన చిట్టి చిట్టి కాళ్లతో అచ్చం అలానే చేస్తుంది. ఆ చిన్ని  కుక్క పిల్ల అలా డాన్స్‌చేస్తుంటే చూడ్డానికి ఎంతో క్యూట్‌గా ఉంది. నెట్టింట వైరల్‌ అవుతున్న లక్షలమంది వీక్షిస్తున్నారు. పప్పీ క్యూట్‌ క్యూట్‌ స్టెప్పులకు ఫిదా అయిపోతున్నారు. లైక్స్‌తో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. మీరు కూడా పప్పీ డ్యాన్స్ పై ఓ లుక్ వేయండి మరి..

Also Read : ఆఫ్ఘనిస్థాన్‌ లోని మసీదులో మళ్ళీ బాంబు పేలుడు.. సుమారు 12 మందికి గాయాలు..

 నా పెళ్ళికి రండి.. భోజనం చేసి రూ. 7,300 చెల్లించండి .. పిల్లల్ని తీసుకుని రావద్దు.. కండిషన్స్ అప్లై.. ఎక్కడంటే..