AP News: గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. తెరిచి చూడగా ఫ్యూజులు ఎగిరేలా.!

అది విజయవాడ రైల్వే స్టేషన్. స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫామ్‌పై గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. ఇక రైల్వే సిబ్బంది అందులో నుంచి పార్శిల్స్ ఒక్కొక్కటిగా దించి.. రైల్వే కార్యాలయానికి తరలించారు. ఇలా తతంగమంతా పూర్తి అయింది. ఈలోగా కస్టమ్స్ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. తెరిచి చూడగా ఫ్యూజులు ఎగిరేలా.!

|

Updated on: Mar 27, 2024 | 3:29 PM

అది విజయవాడ రైల్వే స్టేషన్. స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫామ్‌పై గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. ఇక రైల్వే సిబ్బంది అందులో నుంచి పార్శిల్స్ ఒక్కొక్కటిగా దించి.. రైల్వే కార్యాలయానికి తరలించారు. ఇలా తతంగమంతా పూర్తి అయింది. ఈలోగా కస్టమ్స్ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు రైల్వే పార్శిల్ కార్యాలయానికి తనిఖీల నిమిత్తం వచ్చారు. రైల్వే కార్యాలయాన్ని అంతటా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో భారీగా మిక్సీ గ్రైండర్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఈ మిక్సీ గ్రైండర్లకు.. సరైన బిల్లులు లేకపోవడంతో కస్టమ్స్ అధికారులు వాటిని సీజ్ చేశారు. మరోవైపు ఎన్నికల నేపధ్యంలో సదరు మిక్సీ గ్రైండర్లు ప్రజలకు పంపిణీ చేసేందుకే తరలించారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

Follow us