Health: బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..

Health: బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..

Anil kumar poka

|

Updated on: Dec 11, 2024 | 9:27 AM

ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే పోషకాలు కూరగాయల్లో ఉంటాయి. అలాంటి కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయలో తక్కువ కేలరీలతో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బీరకాయ జీర్ణక్రియను మరింత మెరుగ్గా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో బీరకాయ ఎంతో మేలు చేస్తుంది.

బీరకాయలో నీరు, ఫైబర్‌ కంటెంట్ అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ, సీ, ఐరన్‌, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీరకాయ రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం బాధితుల్లో రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రించడంలో బీరకాయ ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో చరంటిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్ స్ధాయిలు అదుపులో ఉండేలా చేస్తుంది. బీరకాయలో ఉండే అధిక పీచు జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బరువును తగ్గించడంలోనూ బీరకాయ చక్కగా పనిచేస్తుంది. ఇది ఆకలిని తగ్గించడమే కాకుండా అతిగా తినడాన్ని నివారిస్తుంది. శరీరంలోని అదనపు నీటిని తొలగిస్తుంది. దీంతో శరీర బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు తరచుగా బీరకాయ తీసుకోవడం మంచిదంటున్నారు. బీరకాయలో కొవ్వులు తక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పటిష్టం చేయడంలో బీరకాయ కీలకపాత్ర పోషిస్తుంది. బీరకాయ చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. బీరకాయలో ఉండే విటమిన్ సి, కెరిటన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. బీరకాయలో ఉండే సిలికా అనే ఖనిజం.. చర్మం, జుట్టు, గోళ్లు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది. బీరకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తీరిపోయి చర్మ సౌందర్యం పెరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. అనారోగ్యసమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలను పాటించాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.