Chiranjeevi: చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్లో రాబోతున్న మెగా 158 సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే, ఇది వింటేజ్ బాస్ కమర్షియల్ చిత్రం కాదు. బాబీ ఈసారి మెగాస్టార్‌తో ఓ వినూత్న ప్రయోగం చేయనున్నారు. కోల్‌కతా మాఫియా నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామా ఇది. చిరంజీవి టీనేజ్ అమ్మాయికి తండ్రిగా కనిపిస్తారు. 2027 సంక్రాంతికి విడుదల కానుంది.
చిరంజీవి, బాబీ సినిమా ఎలా ఉండబోతుంది..? ఇంకెలా ఉంటుంది.. వాల్తేరు వీరయ్యలో చూసాం కదా వింటేజ్ బాస్‌ను చూపించి బాక్సాఫీస్ బద్దలు కొట్టారు.. మరోసారి బాస్‌తో మాంచి కమర్షియల్ సినిమా ప్లాన్ చేస్తుంటారు అనుకుంటున్నారు కదా..? కానీ అదేం కాదు.. ఈసారి బాబీ ఆలోచనలు మరోలా ఉన్నాయి. మెగాస్టార్‌తో మెగా ఎక్స్పర్మెంట్ చేయబోతున్నారు. మరి అదేంటో చూద్దామా..? మన శంకరవరప్రసాద్ గారు విజయంతో మెగాస్టార్ తన వింటేజ్ మ్యాజిక్ మరోసారి బాక్సాఫీస్‌కు చూపించారు. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లు వసూలు చేసి.. 350 కోట్ల దిశగా అడుగులేస్తుంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న చిరు.. ఇండియాకు వచ్చీ రాగానే బాబీ సినిమాతో బిజీ కానున్నారు. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. జనవరి చివరి వారంలో చిరంజీవి, బాబీ సినిమా ఓపెనింగ్ జరగనుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటికి వచ్చాయి. వాల్తేరు వీరయ్యలా వింటేజ్ బొమ్మ ప్లాన్ చేస్తున్నాడేమో అనుకుంటే.. ఈసారి చిరు ఏజ్‌కు తగ్గట్లు పర్ఫెక్ట్ మూవీ సిద్ధం చేస్తున్నారు బాబీ. మెగా 158 సినిమా కోల్కత్తా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తుంది. చిరుకు బెంగాల్ నేపథ్యం బాగానే కలిసొచ్చింది.. రెండేళ్ల కింద వచ్చిన భోళా శంకర్ డిజాస్టర్ అయినా.. చిరు కెరీర్లో ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చూడాలని ఉందిలో ఉన్నది బెంగాల్ మాఫియానే. బాబీ మరోసారి అదే రిపీట్ చేయాలని చూస్తున్నారు. మెగా 158లో టీనేజ్ అమ్మాయికి తండ్రిగా చిరంజీవి నటించబోతున్నారని.. ఆ పాత్రను కృతి శెట్టి చేయనున్నారని తెలుస్తుంది. హీరోయిన్గా ప్రియమణిని ఎంపిక చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 2027 సంక్రాంతి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి శంకరవరప్రసాద్లో ఇద్దరు స్కూల్ పిల్లల తండ్రిగా నటించిన చిరు.. ఈసారి ఇంకాస్త పెద్ద పాత్రే చేయబోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా.. అరే ఏంట్రా ఇది
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
Vijay Deverakonda: వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
Varanasi: వారణాసి విషయంలో రాజమౌళి సంచలన నిర్ణయం
Venkatesh: ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై వెంకటేష్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

