Credit Card Billing Cycle: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఎలా మార్చాలి? నిబంధనలు ఏమిటి?

Credit Card Billing Cycle: క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను ఎలా మార్చాలి? నిబంధనలు ఏమిటి?

Subhash Goud

|

Updated on: Apr 10, 2024 | 8:35 PM

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌కి సంబంధించిన నియమాలలో రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పుల కారణంగా, మీ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. అంటే, మీరు క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే ఇది బిల్లింగ్ సైకిల్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది. అది ఎలా ప్రయోజనకరంగా మారుతుంది? ఇప్పుడు చూద్దాం. నిజానికి ఆర్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్..

క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌కి సంబంధించిన నియమాలలో రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పుల కారణంగా, మీ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. అంటే, మీరు క్రెడిట్ కార్డ్ యూజర్ అయితే ఇది బిల్లింగ్ సైకిల్‌ను ఎలా ప్రభావితం చేస్తుంది. అది ఎలా ప్రయోజనకరంగా మారుతుంది? ఇప్పుడు చూద్దాం. నిజానికి ఆర్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన కొన్ని నియమాలను ఏప్రిల్ 2022లో తీసుకువచ్చింది. దీని ఉద్దేశం వినియోగదారుకు అతని కార్డ్‌పై మరింత కంట్రోల్ ను ఇవ్వడమే. ఈ నిబంధనలు జూలై 2022లో అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని బ్యాంకులను RBI కోరింది.

నిబంధనల ప్రకారం, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌ను మార్చడానికి వన్-టైమ్ ఆప్షన్‌ను ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు మార్చి 7 నుండి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలలో RBI కొన్ని మార్పులు చేసింది. ఈ మార్పు ప్రకారం, బ్యాంకులు వారి క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు వారి బిల్లింగ్ సైకిల్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు మార్పులు చేసే అవకాశాన్ని ఇవ్వాలి.  మరి క్రెడిట్‌ కార్డు బిల్లింగ్‌ సైకిల్‌ను ఎలా మార్చాలి? వాటి రూల్స్‌ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Published on: Apr 10, 2024 08:34 PM