Dark Patterns: డార్క్ ప్యాటర్న్ అంటే ఏమిటి? మీకు తెలియకుండానే మిమ్మల్ని దోచుకునే ట్రిక్స్‌ను ఏంటి?

కస్టమర్ జేబులు ఖాళీ చేసేందుకు డార్క్ ప్యాటర్న్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తెలియదని కాదు. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్, “సాంకేతికత పెరుగుతున్న కాలంలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలు, ప్రవర్తనను ప్రభావితం చేయడానికి డార్క్ ప్యాటర్న్ ద్వారా తప్పుదారి పట్టిస్తున్నాయని అంగీకరించారు. ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే కాకుండా ఆన్‌లైన్

Dark Patterns: డార్క్ ప్యాటర్న్ అంటే ఏమిటి? మీకు తెలియకుండానే మిమ్మల్ని దోచుకునే ట్రిక్స్‌ను ఏంటి?
Dark Patterns
Follow us

|

Updated on: Apr 11, 2024 | 4:37 PM

మోహిత్.. బ్యాంక్ నుండి పర్సనల్ లోన్ ను వెంటనే పొందాడు. దీంతో అతడికి చాలా సంతోషం అనిపించింది. మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేశాడు. బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు. కానీ మోహిత్ ఈ వ్యక్తిగత రుణాన్ని సమయానికి ముందే తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు ఈ పని ఆన్‌లైన్‌లో జరగదని, రుణాన్ని తిరిగి చెల్లించడానికి అతను బ్యాంకుకు వెళ్లవలసి ఉంటుందని అర్థమైంది. బ్యాంక్.. లోన్‌ను ఆన్‌లైన్‌లో ఇవ్వగలిగినప్పుడు దానిని తిరిగి చెల్లించడానికి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లవలసిన అవసరం ఏమిటో మోహిత్ కు అర్థం కాలేదు. వాస్తవానికి ఇలా ఉద్దేశపూర్వకంగానే చేస్తారు. దీనివల్ల ఖాతాదారుడు బ్యాంకుకు వెళ్లే పేరుతో టైమ్ కేటాయించలేడు. సో.. ఆ అప్పును కంటిన్యూ చేస్తాడు ఈ విధంగా, కస్టమర్ రుణాన్ని తిరిగి చెల్లించకుండా నిరోధించే ఈ ట్రిక్‌ను డార్క్ ప్యాటర్న్ అంటారు. వినియోగదారులకు సరైన పూర్తి సమాచారం ఇవ్వకుండా, వారిని తప్పుదారి పట్టించడం, కొన్నిసార్లు అధిక వడ్డీ, కొన్నిసార్లు వారి నుండి హిడెన్ ఛార్జీలను వసూలు చేస్తారు.

ఇదేం డార్క్ ప్యాటర్న్ అని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారా?

కస్టమర్ జేబులు ఖాళీ చేసేందుకు డార్క్ ప్యాటర్న్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తెలియదని కాదు. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్, “సాంకేతికత పెరుగుతున్న కాలంలో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలు, ప్రవర్తనను ప్రభావితం చేయడానికి డార్క్ ప్యాటర్న్ ద్వారా తప్పుదారి పట్టిస్తున్నాయని అంగీకరించారు. ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మాత్రమే కాకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా డార్క్ ప్యాటర్న్‌లను ఉపయోగిస్తున్నాయి.

ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా రుణాలు తీసుకునే వ్యక్తులు డార్క్ ప్యాట్రన్‌ల సులభమైన లక్ష్యాలుగా మారతారు. ఉదాహరణకు, వ్యక్తిగత రుణాల విషయంలో, రుణానికి సంబంధించిన అన్ని ఖర్చులు, వడ్డీని కస్టమర్‌కు పారదర్శకంగా ఉంచరు. అంటే, వినియోగదారుడిని డార్క్ ప్యాటర్న్ లో ఉంచే అటువంటి పద్ధతిని ఫాలో అవుతారు. ఉదాహరణకు, కస్టమర్‌కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా 8% చొప్పున చౌకగా రుణం ఇస్తున్నారని చెప్పవచ్చు. కానీ రుణం తీసుకున్న తర్వాత అతను వివిధ నిబంధనలు, షరతులతో 36% వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడూ చెప్పరు.

డ్రిప్ ప్రైసింగ్ లేదా హిడెన్ ఛార్జీల గురించి తరచుగా ఫిర్యాదు చేసేది మరొక డార్క్ ప్యాటర్న్. వినియోగదారుడికి.. ప్రీమియం క్రెడిట్ కార్డ్‌ను ఇస్తామని బ్యాంక్ చెబుతుంది. అయితే తర్వాత నెలవారీ బిల్లు వచ్చినప్పుడు, మొదటి ఫీజు వేలల్లో ఉంటుంది. బిల్లింగ్ సైకిల్‌లో ఈ డబ్బును వసూలు చేశారని అర్థం. దాని గురించి వారికి ముందుగా తెలియజేయలేదు. డ్రిప్ ప్రైసింగ్‌లో, ఉత్పత్తులు లేదా సేవలకు తక్కువ ధర ఉంటుందని చెబుతారు. ఇది అమ్మకం చివరి దశలో పెంచుతారు. వినియోగదారుల సర్వే ప్లాట్‌ఫారమ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్న ప్రతి 10 మందిలో 6 మంది, అంటే 60 శాతం మంది ఈ రకమైన మోసానికి గురవుతున్నారు. దేశంలోని 363 జిల్లాల్లో జరిగిన సర్వేలో 63% మంది వ్యక్తులు ఆన్ లైన్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్స్ లోని హిడెన్ ఛార్జీల గురించి చెప్పారు.

41 శాతం మంది వినియోగదారులు తాము ఇంటర్‌ఫేస్ జోక్యాన్ని ఎదుర్కొన్నామని చెప్పారు. ఇంటర్‌ఫేస్ ఇంటర్‌ఫియరెన్స్ అనేది ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల లావాదేవీలకు ఆటంకం కలిగిస్తాయి. అదనపు ఉత్పత్తి లేదా సర్వీసును కొనడానికి, సబ్‌స్క్రైబ్ చేయడానికి వారిని అందులోకి నెట్టివేసే డార్క్ ప్యాటర్న్. 32 శాతం మంది వినియోగదారులు ట్రాప్ సబ్‌స్క్రిప్షన్‌లను ఫేస్ చేసినట్లు చెప్పారు. వినియోగదారులు కొత్త ఆన్‌లైన్ ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం సులభంగా సైన్ అప్ చేసినప్పుడు సబ్‌స్క్రిప్షన్ ట్రాప్‌లు ఏర్పడతాయి, అయితే ఆ సేవ కోసం పదేపదే ఛార్జీని విధిస్తారు. ఒకవేళ వారు కోరుకున్నా ఆ సర్వీసును సులభంగా క్యాన్సిల్ చేయలేరు. దాన్ని మూసివేయాలంటే బ్యాంకు శాఖకు వెళ్లాలి.

ఇది కాకుండా, బైట్, స్విచ్ కేసులను 39% వినియోగదారులు ఫేస్ చేశారు. ఇందులో లోన్‌ను ఆఫర్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయమైన వడ్డీ రేటును చూపిస్తారు. కానీ ఆ తరువాత వడ్డీ రేటు భిన్నంగా ఉంటాయి. డార్క్ ప్యాటర్న్ విషయంలో ప్రభుత్వం నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినా ఇది తగ్గట్లేదు. నవంబర్ 2023లో సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ.. అంటే CCPA వినియోగదారుల హక్కుల పరిరక్షణకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి “డార్క్ ప్యాటర్న్ నివారణ, నియంత్రణ కోసం మార్గదర్శకాలు” అని పేరు పెట్టారు.

దీని పరిధిలో భారతదేశంలో వస్తుసేవలను అందించే అన్ని ప్లాట్‌ఫారమ్‌లు, ప్రకటనదారులు, అమ్మకందారులు ఉన్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ లో ఈ డార్క్ ప్యాటర్న్ లను నివారించడానికి, కస్టమర్ రుణం తీసుకునేటప్పుడే అన్ని ఛార్జీల గురించి ఆరా తీయడం ముఖ్యం. రుణంపై అసలు వడ్డీ, వార్షిక శాతం రేటు అంటే APR గురించి రాతపూర్వక సమాచారం కోసం డిమాండ్ చేయండి. ఎందుకంటే ఇందులో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజుతో సహా అన్ని ఖర్చులు ఉంటాయి. ఆన్‌లైన్‌లో ఏదైనా లోన్ లేదా కార్డ్ తీసుకునే ముందు అన్ని నిబంధనలు, షరతులను చదవండి. చాలా సార్లు నిబంధనలు, షరతులతో పాటు నక్షత్రం గుర్తు ఉంటుంది. కచ్చితంగా దీనిపై శ్రద్ధ వహించండి. మీరు ఏదైనా డార్క్ ప్యాటర్న్ కు టార్గెట్ అయినట్లయితే, మీరు దాని గురించి కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీరు నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌ 1915 నెంబర్‌కు డయల్ చేయచ్చు. లేదా వాట్సాప్ నెంబర్ 8800001915కు టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఫిర్యాదును పంపించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
పంజాబ్‌పై గర్జించిన గైక్వాడ్.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులు
పంజాబ్‌పై గర్జించిన గైక్వాడ్.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులు
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలిసారి ఔట్ అయిన ధోని..
ఐపీఎల్ 2024 సీజన్‌లో తొలిసారి ఔట్ అయిన ధోని..
తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు
తెలంగాణ ఐసెట్ 2024 ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు
స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో నగదు మాయం.. విచారించగా..
స్టేషన్‌లోని బీరువాలో లక్షల్లో నగదు మాయం.. విచారించగా..
గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!
గెట్ రెడీ ఫ్యాన్స్.. పవర్ స్టార్ హరిహర వీరమల్లు టీజర్ లోడింగ్.!
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న గైక్వాడ్.. పంజాబ్ టార్గెట్ 163
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో చల్లచల్లగా కూల్‌ డ్రింక్స్‌ తాగేస్తున్నారా?
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
వేసవిలో పదే పదే విరేచనాలు అవుతున్నాయా? జాగ్రత్త..
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్
రిజర్వేషన్లపై బీజేపీ ఆలోచన ఏమిటో స్పష్టంగా చెప్పాలి.. సీఎం రేవంత్