Fake Apps: పిగ్ బచరింగ్ స్కామ్‌ అంటే ఏమిటి? ఫేక్ యాప్స్ మిమ్మల్ని ఎలా దోచుకుంటాయో తెలుసా?

Fake Apps: పిగ్ బచరింగ్ స్కామ్‌ అంటే ఏమిటి? ఫేక్ యాప్స్ మిమ్మల్ని ఎలా దోచుకుంటాయో తెలుసా?

Subhash Goud

|

Updated on: Apr 10, 2024 | 8:17 PM

ఎక్కువ డబ్బును ఎవరు ఇష్టపడరు చెప్పండి. కానీ త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. సచిన్ విషయంలో అదే జరిగింది. సోషల్ మీడియాలో బ్రోకర్ యాప్ ప్రకటనను చూశాడు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే.. అధిక రాబడిని ఇస్తామంటూ అందులో వాగ్దానం చేశారు. దీంతో సచిన్ దానిపై క్లిక్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా ఆ యాప్ నుండి మెసేజ్‌ల..

ఎక్కువ డబ్బును ఎవరు ఇష్టపడరు చెప్పండి. కానీ త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. సచిన్ విషయంలో అదే జరిగింది. సోషల్ మీడియాలో బ్రోకర్ యాప్ ప్రకటనను చూశాడు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే.. అధిక రాబడిని ఇస్తామంటూ అందులో వాగ్దానం చేశారు. దీంతో సచిన్ దానిపై క్లిక్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా ఆ యాప్ నుండి మెసేజ్‌ల వరద పోటెత్తింది. అవి చూసి.. సచిన్ ఏకంగా రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. 2 వారాల తర్వాత ఆ యాప్ ఫేక్ అని తేలింది. ఈ ఫేక్ యాప్‌.. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌ను కాపీ చేసి తయారు చేశారు. కానీ అదే నిజమైన యాప్ అని సచిన్ నమ్మడమే అతడి లాస్ కు కారణం. సచిన్ ఒక్కడే కాదు. ఈ రకమైన మోసానికి చాలామంది బాధితులు అవుతున్నారు. ఇటువంటి
మోసాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ మోసాన్ని పిగ్ బచరింగ్ స్కామ్ అంటారు.

ఇది ఒక రకమైన పెట్టుబడి మోసం. ఇందులో సైబర్ దుండగులు ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు, సైట్‌లను సృష్టించి రిటర్న్‌ల పేరుతో వ్యక్తుల నుండి డబ్బును దోచుకుంటారు. ఇలాంటి మోసం కేసులు పెరుగుతున్న దృష్ట్యా, స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజ్.. పెట్టుబడిదారులను హెచ్చరించింది.
భారతీయ, అంతర్జాతీయ మొబైల్ నంబర్లు, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానెల్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ల ద్వారా కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు.. పేరుమోసిన ఆర్థిక సంస్థలతో అసోసియేట్ అయ్యామంటూ నకిలీ క్లెయిమ్‌లు చేస్తున్నాయని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే NSE తెలిపింది. వారు SEBI నకిలీ సర్టిఫికేట్లను కూడా చూపిస్తారు. ఇలా ఫేక్‌ యాప్‌ వల్ల చాలా మంది మోసపోతుంటారు. ఫేక్ యాప్స్ మిమ్మల్ని ఎలా దోచుకుంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.