Spice Jet: 1400 మంది ఉద్యోగుల‌పై వేటుకు సిద్ధమైన స్పైస్‌ జెట్‌.!

ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నా చాలా కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్‌ స్పైస్ జెట్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న సిబ్బందిలో 1400 మందిని తొలగిస్తున్నట్లు బాంబు పేల్చింది.

Spice Jet: 1400 మంది ఉద్యోగుల‌పై వేటుకు సిద్ధమైన స్పైస్‌ జెట్‌.!

|

Updated on: Feb 13, 2024 | 8:02 PM

ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తున్నా చాలా కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్‌ స్పైస్ జెట్ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న సిబ్బందిలో 1400 మందిని తొలగిస్తున్నట్లు బాంబు పేల్చింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 15 శాతంగా ఉంటుందని తెలిపింది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నట్లు కనిపిస్తున్న దేశీయ విమానయాన రంగంలో స్పైస్ జెట్ లేఆఫ్స్ ప్రకటనతో ఈ రంగంలోని పరిస్థితులను తెలియజేస్తుందని ఎయిర్‌లైన్స్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ లో 9 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 30 విమానాలు సేవలందిస్తున్నాయి. అందులో విదేశీ విమానయాన సంస్థల నుంచి 8 విమానాలు, పైలట్లు, సిబ్బందితో పాటు అద్దెకు తీసుకుని నడిపిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ నగదు కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోతలు చేపట్టాల్సి వచ్చినట్లు తెలిపింది. ఉద్యోగుల జీతాలే 60 కోట్లు దాటుతున్న క్రమంలో తప్పనిసరిగా సిబ్బంది తగ్గింపు చేపట్టాల్సిన అవసరం ఏర్పడినట్టు పేర్కొంది. లేఆఫ్స్ లో ప్రభావితమవుతోన్న సిబ్బందికి ఇప్పటికే కాల్స వెళ్తున్నట్టు స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త