Garlic cost: జీడిపప్పుతో పోటీపడుతున్న వెల్లుల్లి.. కిలో ఎంతో తెలుసా?
వెల్లుల్లి.. జీడిపప్పు రంగులో ఒకే విధంగా ఉండే ఈ రెండూ మనుషులకు ఎంతో ఆరోగ్యాన్నిచ్చేవి. కొందరు దాదాపు ప్రతి వంటకంలోనూ వెల్లుల్లి ఉపయోగిస్తారు. అంతేనా.. ఔషధాల తయారీలోనూ వెల్లుల్లిని వినియోగిస్తారు. ఇక జీడిపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ధరల్లో ఈ రెండూ ఇప్పుడు పోటీపడుతున్నాయి. వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి.
వెల్లుల్లి.. జీడిపప్పు రంగులో ఒకే విధంగా ఉండే ఈ రెండూ మనుషులకు ఎంతో ఆరోగ్యాన్నిచ్చేవి. కొందరు దాదాపు ప్రతి వంటకంలోనూ వెల్లుల్లి ఉపయోగిస్తారు. అంతేనా.. ఔషధాల తయారీలోనూ వెల్లుల్లిని వినియోగిస్తారు. ఇక జీడిపప్పు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ధరల్లో ఈ రెండూ ఇప్పుడు పోటీపడుతున్నాయి. వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని వైకుంఠ్‌పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్‌తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని 400 నుండి 600 రూపాయలకు విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి 200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర 200 ఉండగా, ప్రస్తుతం 600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర 800 నుంచి 1000 రూపాయల మధ్య ఉంటోంది. అయితే ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్‌సేల్‌లో కూడా వెల్లుల్లి కిలో 400 రూపాయలు పైనే విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్‌లో వెల్లుల్లి ధర 600 దాటింది. ఇటీవలే కొత్త వెల్లుల్లి మార్కెట్‌లోకి రావడంతోనే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారని దీంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారని, అందుకే ఈసారి వెల్లుల్లి సాగు తగ్గించడంతో మార్కెట్‌లో వెల్లుల్లి కొరత ఏర్పడి ధరలు బాగా పెరిగాయని స్థానిక రైతు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..