Jio Fiber: ఫ్రీగా జియో ఫైబర్ కొత్త కనెక్షన్.. ఏయే సేవలు పొందవచ్చంటే..! పూర్తి వివరాలు..
జియో ఫైబర్ దేశంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వచ్చింది.
జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 499 రూపాలయ నుండి ప్రారంభమవుతుంది. ఈ ధర నెలవారీ ఛార్జీగా చెల్లించబడుతుంది. జియో ఫైబర్ కొత్త ఆఫర్ కింద వినియోగదారులు రూటర్ ఫీజు, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో మరో ఫెసిలిటీ ఏంటంటే.. వినియోగదారులు డేటాతో పాటు OTT ప్రయోజనాన్ని కూడా పొందుతున్నారు. JioFiber చౌకైన 499 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులకు 6 OTT యాప్‌లకు యాక్సెస్ ఇస్తుంది. ఈ జియో ఫైబర్ ప్లాన్‌ను 6 నెలలు లేదా 12 నెలల పాటు కొనుగోలు చేయవచ్చు. దీనిలో వినియోగదారులు 30Mbps వేగం పొందుతారు. అదే సమయంలో 599 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 14 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతారు. ఈ ప్లాన్‌లో కూడా వినియోగదారులు 30Mbps వేగం పొందుతారు. అయితే, దీనికి ఎక్కువ ఓటీటీ ప్రయోజనాలు ఉన్నాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లైవ్, ఇతర ప్లాన్‌లకు కస్టమర్‌లు యాక్సెస్ పొందుతారు. ఇది వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్‌లను, 550కి పైగా ఆన్-డిమాండ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌ను 6 నెలలు లేదా 12 నెలల పాటు కూడా కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..