Gold Price: బంగారం ధర మరింత పెరగనుందా.? ఇప్పటికే ఆల్‌ టైం రికార్డ్‌ ధర.

Gold Price: బంగారం ధర మరింత పెరగనుందా.? ఇప్పటికే ఆల్‌ టైం రికార్డ్‌ ధర.

Anil kumar poka

|

Updated on: Mar 12, 2024 | 4:42 PM

ఇప్పటికే బంగారం ధరలు రోజు రోజుకీ పెరగుతూ సామాన్యుడి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఈ సమయంలో తప్పనిసరిగా కనీసం మంగళసూత్రం వరకైనా బంగారం కొనాలని భావిస్తారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఈ ఏడాది ఆల్‌టైమ్‌హైకి చేరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే బంగారం ధరలు రోజు రోజుకీ పెరగుతూ సామాన్యుడి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ఈ సమయంలో తప్పనిసరిగా కనీసం మంగళసూత్రం వరకైనా బంగారం కొనాలని భావిస్తారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఈ ఏడాది ఆల్‌టైమ్‌హైకి చేరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరంలోనే 10 గ్రాములు బంగారం రూ.72వేలు పలుకుందని అంచనాలు వేస్తున్నారు. దేశీయ, విదేశీ స్టాక్‌మార్కెట్లు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంకుల విధానాలు, యూఎస్‌ డాలర్‌ ఇండెక్స్‌, బాండ్‌ ఈల్డ్స్‌తోపాటు భారత్‌సహా పలు ప్రధాన దేశాల్లో ఎన్నికలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక తాజాగా నమోదైన వివరాల ప్రకారం దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరల్ని పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,880 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60,400 రూపాలయు పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65,730లు, 22 క్యారెట్ల బంగారం ధర 60,250 రూపాయలుగా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,600 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,050 రూపాయలు పలుకుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,730 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60,250 రూపాయలు పలుకుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,730 రూపాయలు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,250 రూపాయలు పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos