గుడ్‌న్యూస్‌.. క్యాన్సర్‌కు టీకా రెడీ.. ట్రయల్స్‌లో మంచి ఫలితాలు

గుడ్‌న్యూస్‌.. క్యాన్సర్‌కు టీకా రెడీ.. ట్రయల్స్‌లో మంచి ఫలితాలు

Phani CH

|

Updated on: Feb 06, 2024 | 9:44 PM

ఇటీవలి కాలంలో కేన్సర్ మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మరణాలు సంభవిస్తున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ కేసులు 77 శాతానికి చేరుకుంటాయని, ఏటా మూడున్నర కోట్ల మంది క్యాన్సర్‌ బారినపడతారని ఇటీవల ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో బ్రిటన్ శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్‌ చెప్పారు. కేన్సర్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు.

ఇటీవలి కాలంలో కేన్సర్ మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మరణాలు సంభవిస్తున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ కేసులు 77 శాతానికి చేరుకుంటాయని, ఏటా మూడున్నర కోట్ల మంది క్యాన్సర్‌ బారినపడతారని ఇటీవల ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో బ్రిటన్ శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్‌ చెప్పారు. కేన్సర్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. క్యాన్సర్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ తయారుచేశామని, కరోనా టీకా తయారీలో ఉపయోగించే మెసెంజర్ MRNA సాంకేతికతను వాడి టీకాను అభివృద్ధి చేసినట్టు వివరించారు. గ్లోబల్ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లో కేన్సర్ రోగులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి మంచి ఫలితాలు సాధించినట్టు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఊపిరితిత్తులు, చర్మ కేన్సర్, ఇతర క్యాన్సర్లపై వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితను అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ వైపు కష్టం.. మరోవైపు సంతోషం.. కశ్మీర్లో విచిత్ర పరిస్థితి

విమానంలో అసభ్య ప్రవర్తన తరువాత చివరకు జరిగింది ఇదే

SS Thaman: తమన్‌ అత్యుత్సాహం.. పక్కకు పెట్టిన గురూజీ

ఆ ఒక్క కారణంతో.. రణ్బీర్‌ మెసేజ్‌ చూడలే.. రిప్లై ఇవ్వలే

Viswambhara: అద్భుత లోకంలో అడుగుపెట్టిన విశ్వంభర