AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాత్రూంలో జారిపడి.. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత

బాత్రూంలో జారిపడి.. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 12:42 PM

Share

బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ గుప్తా కన్నుమూశారు. అక్టోబర్‌ 30న ముంబైలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు తీవ్ర గాయమై మరణించినట్లు వార్తలు వెల్లడించాయి. ‘ఆతిష్‌: ఫీల్‌ ద ఫైర్‌’తో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ‘కాంటే’, ‘జంగ్‌’, ‘ఖౌఫ్‌’, ‘కాబిల్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణవార్తపై దర్శకుడు అశోక్‌ పండిట్‌ సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సంజయ్‌ గుప్తా! బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ డైరెక్టర్.. ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడి కన్నుమూశారు. శుక్రవారం అంటే 30th నవంబర్‌.. ఎప్పటిలానే బాత్రూంకి వెళ్లిన ఆయన జారి పడడంతో తలకు గాయమైంది. ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను ఎవరూ గమనించకపోవడంతో.. మరణించినట్టుగా తెలుస్తోంది. 994లో విడుదలైన ‘ఆతిష్: ఫీల్ ద ఫైర్’ సినిమాతో సంజయ్ గుప్తా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. తర్వాత ‘రామ్ శాస్త్ర’, ‘జంగ్’, ‘ఖౌఫ్’ తదితర చిత్రాలు తెరకెక్కించారు. 2002లో విడుదలైన మల్టీస్టారర్ చిత్రం ‘కాంటే’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల కెరీర్‌లో దర్శకుడిగానే కాకుండా రచయిత, నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు. చివరగా రెండేళ్ల క్రితం ‘ది మిరిండా బ్రదర్స్’ మూవీ తీశారు. సంజయ్ గుప్తా మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఆయన మిత్రుడు ప్రముఖ దర్శకుడు అశోక్ పండిట్.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. మన స్నేహితుడు, దర్శకుడు సంజయ్ గుప్తా ఇక లేరనే వార్త ఇప్పుడే తెలిసింది. ఇంట్లో తలకు గాయం కావడంతో ఆయన మరణించారు. మరో అద్భుతమైన ప్రతిభను చాలా త్వరగా కోల్పోయాం. సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు. మిత్రమా.. నిన్ను మిస్ అవుతాం.” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు అశోక్ పండిట్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Abhishek Sharma: టీమిండియా కొత్త కెప్టెన్ గా అభిషేక్ శర్మ.. కానీ ఓ కండీషన్

రాధిక సహాయకురాలి కొడుకు దారుణ హత్య..బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు

Dorothy: డోరతి ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే..లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు!

Rohit Elimination: సెలబ్రిటీల దెబ్బకు రోహిత్ ఎలిమినేషన్!

Bigg Boss 10 Telugu: చేతులారా చేసుకున్న ఫలితం.. బిగ్ బాస్ హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ ఔట్

Follow Us