కర్నూలు పట్టణంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. వెల్దుర్తి మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న చెరుకులపాడు క్రాస్ రోడ్డులో ఓ ఇంట్లో క్షుద్రపూజలు జరిగినట్లు ఆ ప్రాంతంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో క్షుద్ర పూజలు చేశారంటూ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండడంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కొంతమంది అందులో చేతబడులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అప్పు ఎగ్గొట్టేందుకు ఆ వ్యక్తి ఇలా చేయిస్తున్నాడంటూ ఆ ప్రాంతంలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గుప్త నిధుల కోసం పూజలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.