Telangana: బ్యాగుతో బస్టాండ్‌లో.. అదోలా వాలకం.. పోలీసులు వెళ్లి చెక్ చేయగా..
గంజాయిని అమ్మడానికి ప్రయత్నించిన యువకుడిని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా బస్టాండ్‌లోనే గంజాయిని అమ్మడానికి యత్నించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి 1కిలో 22 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి...
ఎంత బరితెగింపు.. ఎంత లెక్కలేనితనం. అవును.. ఏకంగా ఆర్టీసీ బస్టాండ్‌లోనే గంజాయి అమ్మేందుకు యత్నించాడు ఈ కేటుగాడు. బస్టాండ్‌లో అనుమానాస్పదంగా ఓ బస్తా సంచితో కనిపించడంతో పోలీసులకు డౌట్ వచ్చింది. అతడ్ని అదుపులోకి తీసుకుని చెక్ చేయగా బ్యాగులో లోపల గంజాయి కనిపించింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ బస్టాండ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. అతని వద్ద నుంచి 1కిలో 22 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి ఆ గంజాయిని విక్రయించడానికి తెచ్చినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరు..? ఎంతకాలంగా గంజాయి రవాణా చేస్తున్నాడు..? దీని వెనక ఎవరెవరు ఉన్నారు..? గంజాయి ఎక్కడి నుంచి తెచ్చాడు అనే అంశాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

