Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువతకు బంపర్‌ ఆఫర్‌ ఆ ఒక్క పని చేస్తే శ్రీవారి బ్రేక్‌ దర్శనం

యువతకు బంపర్‌ ఆఫర్‌ ఆ ఒక్క పని చేస్తే శ్రీవారి బ్రేక్‌ దర్శనం

Samatha J

|

Updated on: May 15, 2025 | 6:45 PM

తిరుమల శ్రీ వారిని దర్శించుకునేందుకు విఐపి బ్రేక్ దర్శనాలకు ఉండే గ్రేస్ ఏ వేరు తెల్లవారుజామున శ్రీ వారిని బ్రేక్ దర్శనం చేసుకునేందుకు సిఫార్సు లేఖల కోసం పైరవీలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల రద్దీ దృష్ట్యా సిఫార్సు లేఖలతో దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేశారు. మే ఒకటి నుంచి జూలై 15వ తేదీ వరకు అమలులో ఉండనుంది. ఈ నేపథ్యంలో యువతకు బంపర్ ఛాన్స్ ఇస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏడు కొండలపై వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకునే అవకాశం కల్పిస్తుంది టిటిడి. అయితే ఇందుకోసం వాళ్లు ఓ పని చేయాల్సి ఉంటుంది. సనాతన ధర్మం మీద యువతలో మరింత అనురాగాన్ని కలిగించే ఉద్దేశంతో రాముకోటి తరహాలో గోవిందకోటిని రెండేళ్ల కింద ప్రవేశపెట్టింది టిటిడి.

గోవిందకోటి రాసిన యువతకు విఐపి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తూ వస్తుంది. 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు దీనికి అర్హులు. 10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు రాసినవారు విఐపి బ్రేక్ దర్శనం ద్వారా నేరుగా శ్రీ వారిని చూసి తరించవచ్చు. కోటి సార్లు గోవింద నామాలు రాస్తే వారితో పాటు కుటుంబ సభ్యులంతా విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. టిటిడి సమాచార కేంద్రాలతో పాటు పుస్తక విక్రయ కేంద్రాలు ఆన్లైన్లోనూ గోవిందకోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కోటి నామాల పుస్తకాన్ని పూర్తి చేయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టిటిడి అంచనా వేసింది. 200 పేజీలు ఉండే దాదాపు 26 పుస్తకాలు అవసరమవుతాయని తెలిపింది. తిరుమలలోని టిటిడి పేస్ కార్ ఆఫీస్ లో గోవిందకోటి నామాల పుస్తకాన్ని అందిస్తే ఆ తర్వాతి రోజు విఐపి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తామని టిటిడి అధికారులు తెలిపారు.