ఉదయాన్నే కాఫీ, టీలకు బదులు ఇవి తాగండి.. సూపర్ బెనిఫిట్స్..!
ఉదయాన్నే చాలామందికి టీ, కాఫీలతో రోజు మొదలవుతుంది. కొందరు బెడ్ కాఫీ పేరుతో లేస్తూనే టీనో కాఫీనో తాగితే కానీ మంచం దిగరు. ఇలా పరగడుపునే కాఫీ, టీలు తాగడం అంతమంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కరోనా మహమ్మారి దాడితో మానవాళి ఆరోగ్యం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఏది తినాలన్నా, తాగాలన్నా భయపడుతున్నారు.
ఆచి,తూచి ఆరోగ్యకరమైన ఆహారం తినడానికే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో వైద్య నిపుణులు ఓ సూచన చేస్తున్నారు. ఎంత కాఫీ,టీలకు ఎడిక్ట్ అయిపోయినా ఉదయాన్నే మాత్రం ఈ నీటిని తాగండి అంటూ ఓ నాలుగు రకాల పానీయాలను సూచిస్తున్నారు. వీటివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు. ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకొని తాగుతూ మీ రోజును ప్రారంభిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నారు. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుందని సూచిస్తున్నారు. ఉసిరికాయ విటమిన్ సి కి మంచి మూలం. ఉదయాన్నే ఈ ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల జుట్టు, చర్మం, కళ్ళకు మంచిది. దీంతో పాటు ఇది కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే తాగాల్సిన మరో అద్భుతమైన పానీయం.. జీలకర్ర నీరు. ఒక చెంచా జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మరిగించి తాగాలి. ఈ పానీయం కడుపు ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గిస్తుంది. దీనితో పాటు ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్ పోర్ట్ లో మహిళ.. ఆమెను గుర్తు పట్టని స్కానర్! ఆమె ఏం చేసిందంటే..?
TOP 9 ET News: వెయ్యి మందితో యుద్ధం.. దద్దరిల్లే ఇంటర్వెల్‌కు నీల్ శ్రీకారం
బాబోయ్! మినీ బస్సు సైజులో మొసలిని చూశారా

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
