ఎయిర్ పోర్ట్ లో మహిళ.. ఆమెను గుర్తు పట్టని స్కానర్! ఆమె ఏం చేసిందంటే..?
మేకప్ ఓవర్ అయితే ఇలాగే ఉంటుంది. అందంగా కనిపించేందుకు లేడీస్ మేకప్ చేసుకోవడం ఈ రోజుల్లో కామన్. కానీ అది ఓవర్ అయితే జరిగే పరిణామాలకు ఇది ఉదాహరణగా చెప్పొచ్చు. ఓవర్ మేకప్ తో ఓ మహిళకు ఎయిర్ పోర్టులో ఎదురైన విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది..వివరాల్లోకి వెళితే.. మహిళలు అందంగా కనిపించేందుకు రకరకాలుగా మేకప్ వేసుకుంటారు.
వేయాల్సిన మోతాదుతో మేకప్ వేస్తే పర్వాలేదు చూడటానికి గుడ్ లుక్ కనిపిస్తుంది..కానీ అదే మేకప్ ఓవర్ అయితే మాత్రం నవ్వుల పాలు కావాల్సిందే.. ఇదే జరిగింది చైనాలో ఓ మహిళకు. షాంఘై లోని విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ దగ్గర తన మేకప్‌ను తొలగించాల్సి వచ్చింది. ముఖ గుర్తింపు స్కానర్లు ఆమె పాస్‌పోర్ట్‌లోని ఫోటోతో ఆమె ముఖం ఆకృతిని సరిపోల్చలేకపోయాయి. ఇది కాస్త నెట్టింట వైరల్ అయింది. సోషల్ మీడియాలో వేలాది మందిని ఆకట్టుకుంది వీడియో. ఆ మహిళ చివరికి తన బ్రైడల్ మేకప్ ను తొలగిస్తున్న దృశ్యాలు కనిపించాయి. అంతే కాదు ఇంతలా మేకప్ ఎందుకు వేసుకున్నావమ్మా అని ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తిడుతున్నట్లు కనిపించింది. “నీ పాస్‌పోర్ట్ ఫోటోలా కనిపించే వరకు అన్నీ తుడిచివేయి” అని ఆ వ్యక్తి చెప్పడం వినిపించింది. ఎయిర్ పోర్టులోని స్కానర్ గుర్తుపట్టకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీడియోపై నెటిజన్లు స్పందన రకరకాలుగా ఉంది. ‘‘ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి కనికరం లేదు గురూ.. అది సాదారణ మేకప్ కాదు.. కాస్ట్ లీ’’ అంటూ ఓ నెటిజన్ చమత్కరించాడు. ‘‘ఇంత జరిగినా ఆమె మేకప్ వేయకుండా ఉంటుందా’’ మరో నెటిజన్ కామెంట్. ఇలా నెట్టింట ఆడవాళ్ల మేకప్ పై పెద్ద చర్చే జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: వెయ్యి మందితో యుద్ధం.. దద్దరిల్లే ఇంటర్వెల్‌కు నీల్ శ్రీకారం
బాబోయ్! మినీ బస్సు సైజులో మొసలిని చూశారా
ఒక్క ఫోటోతో.. సోషల్ మీడియాను ఫిదా చేసిన రష్మిక
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

