AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!

Phani CH
|

Updated on: Sep 26, 2025 | 6:43 PM

Share

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారి, శనివారం ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించిది.

శుక్ర,శనివారాల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తుఫాను హెచ్చరికలు జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప జనాలను బయటకు రావొద్దంటూ ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. శుక్రవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్ప పీడనం ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీయననున్న నేపథ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలోని భవనాలు వద్ద ఉండరాదని, సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. వాయుగుండం, అల్పపీడనం ప్రభావంతో ఇటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. శనివారం ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రాగల నాలుగు రోజులు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెహమాన్‌ పాట శివస్తుతి కాపీనా ?? కోర్టు ఏం చెప్పిందంటే

గంగమ్మ ఎండిపోతోందా? ఎందుకిలా!

Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం

తన చేతికొచ్చిన మూవీని గోపీచంద్‌కు ఇచ్చేసిన ప్రభాస్..

ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా

Published on: Sep 26, 2025 06:42 PM