Sai Pallavi: సాయి పల్లవికి అరుదైన గౌరవం
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విలక్షణ నటనతో అతి తక్కువ సమయంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. సాయిపల్లవి తాజాగా తన కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'కళైమామణి' పురస్కారానికి సాయిపల్లవి ఎంపికయ్యారు.
కళారంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. తమిళనాడు ప్రభుత్వం 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన కళైమామణి పురస్కారాల విజేతలను ప్రకటించింది. ఇందులో భాగంగా, 2021 సంవత్సరానికి గాను నటి సాయి పల్లవికి ఈ అవార్డు లభించింది. ఆమెతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి గాను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు లభించింది. ఇంకా దర్శకులు ఎస్.జె. సూర్య, లింగుసామి, నటులు విక్రమ్ ప్రభు, మణికందన్ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారిని గౌరవించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాన్ని అందిస్తుంది. తమిళనాడులోని ఉన్నత పౌర పురస్కారాలలో కళైమామణి ఒకటి. ఈ అవార్డు కింద విజేతలకు మూడు సవర్ల బంగారు పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. త్వరలోనే జరగనున్న ఓ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా విజేతలకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన చేతికొచ్చిన మూవీని గోపీచంద్‌కు ఇచ్చేసిన ప్రభాస్..
ఫ్లాపుల దారి పట్టిన ముగ్గురు మొనగాళ్లు.. వారు చేస్తున్న తప్పు ఇదేనా
ప్యాన్ ఇండియన్ దెబ్బకు తలలు పట్టుకుంటున్న హీరోయిన్స్.. ఇమేజ్ పోయి.. బ్యాగేజ్ వచ్చిందిగా
స్పైడర్ మ్యాన్‌కి గాయాలు.. ఫ్యాన్స్‌లో ఆందోళన
ఏంటి! ‘కాంతార 2’ చూసేందుకు మద్యం, మాంసం తినకుండా వెళ్లాలా? రిషబ్ షాకింగ్ ఆన్సర్
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?

