మామిడి పండ్లను ఇలా తింటే.. మీ ఇమ్యునిటీ డబుల్ వీడియో
వేసవి వచ్చిందంటే వెంటనే గుర్తొచ్చేది మామిడి పండ్లు. సమ్మర్ సీజన్లో మార్కెట్లో ఎటు చూసినా రకరకాల మామిడి పండ్లు దర్శనమిస్తాయి. మామిడి పండ్లను ఫలరాజుగా పిలుస్తారు. ఎందుకంటే అన్ని పండ్లలోనూ దీని రుచి డిఫరెంట్ గా అద్భుతంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఒక్కో రకం మామిడి పండు ఒక్కో రుచితో ఆహార ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ మామిడి పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో దిట్ట. గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులతో పోరాడి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే మీరు మామిడి పండ్లను సరైన పద్ధతిలో తింటున్నారా? మామిడి పండ్లను ఎలా తినాలి? ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
మామిడిలో విటమిన్లు పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ముక్కలు చేసుకొని మిక్సీలో పేస్ట్ లా చేసి పాలల్లో కలుపుకొని తింటే రెట్టింపు ప్రయోజనం ఉందంటున్నారు నిపుణులు. మామిడి జ్యూస్ తాగినా కూడా ఎముకలు బలంగా తయారవుతాయని చెబుతున్నారు. పండిన మామిడి పండ్లను పాలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి రంగు వస్తుంది. అంతేకాక ఇది శరీరాన్ని చల్లబరుస్తుందని అలాగే అధిక పోషకాలను అందిస్తుంది. సాధారణంగా భోజనం తర్వాత లేదా భోజనంతో పాటు పండ్లను తీసుకోవద్దని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది. అయితే మామిడి పండ్లను మాత్రం భోజనంతో కలిసి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే ఉబ్బరం నిరోధించడానికి సహాయపడుతుంది. అంతేకాదు మామిడి ఆకులను మిక్సీలో పేస్ట్ లా చేసి మీగడతో కలిపి ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒక వారం పాటు చేస్తే ముఖంపై మచ్చలు, ముదురుమలు, బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గిపోతాయని అంటున్నారు.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
