హృదయవిదారకం.. కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి వీడియో
నవమాసాలు మోసి కని పెంచిన తల్లి తాను చనిపోతే కొడుకు తలకోరివి పెడతాడు అనుకుంటుంది. కానీ కని పెంచిన చేతులతో కొరివి పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆ తల్లి బాధ వర్ణనాతీతం. అలాంటి హృదయ విదారక ఘటన కోనసీమ జిల్లాలో వెలుగు చూసింది. వయసు పైబడిన తల్లి తన కొడుకుకు తలకోరివి పెట్టడం చూసి అందరూ కన్నీరు కార్చారు.
కోనసీమ జిల్లాలో గుండెలను పిండేసే ఘటన జరిగింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లెపాలెంకు చెందిన కాశమాని దుర్గా ప్రసాద్ ద్విచక్ర వాహనంపై తన అత్తవారింటికి భీమవరం వెళుతూ దారిలో ఎదురుగా వస్తున్న చేపల వాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. దుర్గా ప్రసాద్ మృతితో ఆ నిరుపేద కుటుంబం ఇంటి ఆధారాన్ని కోల్పోయింది. ఇటీవల దుర్గా ప్రసాద్ తండ్రి కూడా మరణించడంతో తలకోరివి పెట్టడానికి ఎవరూ లేని దీనా పరిస్థితి ఆ కుటుంబానిది. దాంతో గోరముద్దలు తిని పిండి పెద్ద చేసిన కన్న తల్లి తలకోరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించిన ఘటన స్థానికులను కలిచివేసింది. హిందూ ధర్మ శాస్త్రాన్ని అనుసరించి తల్లి దండ్రులకు తలకోరివి పెట్టి దహన సంస్కారాలను కొడుకులు నిర్వహిస్తుంటారు. విధి ఆడిన వింట నాటకంలో చేసేదేం లేక కన్న కొడుకుకు తలకోరివి పెట్టే బాధ్యత ఆ తల్లి తీసుకుంది.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
