ఈ పండు..మీ గుండెకు శ్రీరామ రక్ష వీడియో
మనం సాధారణంగా పసుపు, ఆకుపచ్చ, అరటిపండ్లు ఎక్కువగా తింటూ ఉంటాం. బనానా ఎంత బలవర్థకమైన ఆహారమో అందరికీ తెలుసు. మనకి ఎర్రటి అరటిపండ్లు కూడా దొరుకుతాయి. ఇక ఈ ఎర్రటి అరటిపండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక అవే కావాలంటారు. ఈ పండ్లు రోజూ తింటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జీర్ణక్రియకు ప్రయోజనం చేకూరుతుంది. ఎర్ర అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో సహాయపడుతుంది.
ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, బీటా కెరోటిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఎర్రటి అరటిపండు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పండుతుంది. ఇందులో ఉండే అధిక పొటాషియం హైపర్ టెన్షన్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. ఇందులో మెగ్నీషియం కూడా మెండుగా ఉంటుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్ట్రోకులు, గుండె సమస్యలకు దూరం చేస్తుంది. ఎర్రటి అరటిపండ్లు తినడం వల్ల చర్మం ఎర్రబడటం, పొడిబారడం, దద్దుర్లు, సోరియాసిస్ వంటి అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. చలికాలంలో చర్మం పగలడం కూడా తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతుంటే ఎర్రటి అరటిపండు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎర్రటి అరటిపండ్లలో ల్యూటీన్, బీటా కెరోటిన్ అనే రెండు కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పసుపు అరటిపండుతో పోలిస్తే దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకం. ఈ సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించండి.

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
