బాల రాముడి దివ్యమైన కనులను చెక్కింది వీటితోనే.. అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్
అయోధ్య రామమందిరంలో పూజలు అందుకుంటున్న బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. చిరునవ్వుతో కనిపిస్తున్న విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆయన కళా నైపుణ్యాన్ని రామ భక్తులు అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అయితే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన రూపొందించిన విగ్రహానికి కోట్లాది మంది భక్తులు పూజలు చేస్తున్నారని, ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుందని అంటున్నారు.
అయోధ్య రామమందిరంలో పూజలు అందుకుంటున్న బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. చిరునవ్వుతో కనిపిస్తున్న విగ్రహాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఆయన కళా నైపుణ్యాన్ని రామ భక్తులు అందరూ మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అయితే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన రూపొందించిన విగ్రహానికి కోట్లాది మంది భక్తులు పూజలు చేస్తున్నారని, ఇంతటి అదృష్టం ఎవరికి దక్కుతుందని అంటున్నారు. అరుణ్ యోగిరాజ్ కుటుంబం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తన కొడుకు రూపుదిద్దిన బాల రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించడం తమ కుటుంబానికి దక్కిన అదృష్టమని అరుణ్ తల్లి పేర్కొన్నారు. తాజాగా బాల రాముడి విగ్రహానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని అరుణ్ యోగిరాజ్ వెల్లడించారు. బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కిన పనిముట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెండి సుత్తి, బంగారు ఉలిని చేతిలో పట్టుకుని చూపిస్తూ.. వీటితోనే బాల రాముడి విగ్రహానికి దివ్య నేత్రాలను తీర్చిదిద్దానని తెలిపారు. ఈ ఫొటోను అరుణ్ యోగిరాజ్ ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP9 ET: మహేష్ సినిమా అంటే చులకనా.. ఫ్యాన్స్ సీరియస్ | ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన డైరెక్టర్
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు
దేవతా వృక్షాల్లో ఇవే నెంబర్ వన్... కాశీ తర్వాత ఇక్కడే...
వావ్.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా
నో డిలే.. నో డైవర్షన్.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో
ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ..

