APSRTC – Ayodhya: బాలరాముడి దర్శనానికి ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.!

అయోధ్య బాలరాముడి దర్శనం కోసం దేశం నలుమూలలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాలనుంచి విమానాలు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రామ్‌లల్లా దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీసీ డిపో ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శించే భక్తుల కోసం కొత్తగా రెండు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. అందులో ఒక సర్వీసు అయోధ్య మీదుగా కాశీకి, మరొక సర్వీసు అయోధ్య శివకాశి యాత్ర.

APSRTC - Ayodhya: బాలరాముడి దర్శనానికి ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.!

|

Updated on: Feb 06, 2024 | 7:12 PM

అయోధ్య బాలరాముడి దర్శనం కోసం దేశం నలుమూలలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాలనుంచి విమానాలు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రామ్‌లల్లా దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీసీ డిపో ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శించే భక్తుల కోసం కొత్తగా రెండు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. అందులో ఒక సర్వీసు అయోధ్య మీదుగా కాశీకి, మరొక సర్వీసు అయోధ్య శివకాశి యాత్ర. ఇప్పటికే ఫిబ్రవరి 5 న అయోధ్య మీదుగా కాశీకి కొవ్వూరు డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి వెళ్లింది. యాత్రలో భువనేశ్వర్ లోని లింగరాజు ఆలయం, పూరి జగన్నాథ స్వామి ఆలయం, కోణార్క్ లోని సూర్య ఆలయం, జాజిపూర్ గిరిజా దేవి శక్తిపీఠం, ప్రయాగ త్రివేణి సంగమం, నైమిశారణ్యం సుదర్శన చక్ర తీర్థం, గోమతి నది, లలితా దేవి శక్తిపీఠం, అయోధ్య, సరయు నది, వారణాసి విశ్వనాథ ఆలయం, గంగా నది, గయా మాంగళ్య గౌరీ శక్తిపీఠం, శిరోగయ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీకూర్మం విష్ణుమూర్తి ఆలయం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ దర్శనాలు అనంతరం ఫిబ్రవరి 15న కొవ్వూరు చేరుతుంది. ఇందుకోసం ఒక్కొక్క ప్రయాణికుడికి టికెట్ ధర 11,500 రూపాయలుగా ఆర్టీసీ నిర్ణయించింది.

ఇక రెండో సర్వీసు అయోధ్య శివకాశి యాత్ర ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం కొవ్వూరు నుంచి బయలుదేరుతుంది. ఈ యాత్ర సుమారు 13 రోజులు పాటు కొనసాగుతుంది. ఇందుకోసం కోసం ఒక్కొక్క ప్రయాణికుడికి టికెట్ ధర 13,500 రూపాయలుగా నిర్ణయించింది. అయితే కాశీ వరకు పాత సర్వీస్ మాదిరిగానే చేరుకుంటుంది తిరిగి వచ్చే క్రమంలో చిత్రకూట్ సతీ అనసూయ స్తలి , సత్య మహర్షి ఆశ్రమం, ఉజ్జయిని శక్తిపీఠం, మహకాళేశ్వర స్వామి ఆలయం, బాసర సరస్వతి దేవి ఆలయం, ధర్మపురి యోగ నరసింహస్వామి ఆలయం, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం, యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, వరంగల్ వేయి స్తంభాల గుడి మీదుగా మీదుగా కొవ్వూరు చేరుకుంటుంది. అంతేకాకుండా నవశైవ క్షేత్ర దర్శనీ పేరుతో మంత్రాలయం, అలంపురం మహానంది, యాగంటి, బనగానపల్లె, శ్రీశైలం, తిరుపురాంతకం, కోటప్పకొండ విజయవాడ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశారు. వాటికి టిక్కెట్లు ధర 3200 రూపాయలుగా నిర్ణయించారు. అదేవిధంగా దేవాదాయ శాఖ సమన్వయంతో శ్రీశైలం దర్శించే భక్తులకు మల్లికార్జున స్వామి దర్శన సౌకర్యం కల్పించే కార్యాచరణకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. టిక్కెట్ రిజర్వేషన్లతో పాటు దర్శనం టికెట్ కూడా ముందుగానే పొందే అవకాశం కల్పించనున్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేలాగా అరుణాచలానికి ప్రత్యేక సర్వీసును కొవ్వూరు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసింది. అటు ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో బాధ్యతగా వ్యవహరిస్తూ భక్తుల సౌకర్యార్థం తీర్థయాత్రలకు సంబంధించి కొవ్వూరు డిపో ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వీసుల పట్ల ఆర్టీసీకి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
రూ. 15వేలోనే 108 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
FCRA చట్టాన్ని మరింత బలోపేతం చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
మోదీ 10 ఏళ్లలోనే నిజం చేసి చూపించారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
కేటీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌.. ఒక్క సీటు గెలిచి చూపించండి అంటూ
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
పోలవరం విషయంలో ఏపీ సర్కార్ సీరియస్‌గా లేదు: రాజ్‌నాథ్ సింగ్‌
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
మహేశ్ బాబు మెచ్చిన 'పోచర్' వెబ్ సిరీస్‌ .. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
రేయ్ ఎవర్రా మీరంతా.! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్.. దున్నపోతుపై..
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
ప్రశాంత్ నీల్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా.?
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..
మోదీ నాయకత్వంలో గెలుపు అలవాటుగా మారింది, అమిత్ షా..