AP Weather Report: ఏపీకి గుడ్ న్యూస్.. అప్పటి నుంచి వానలే.. వానలు.
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఇంకా నిప్పుల కొలిమిలా మండిపోతోంది. ఈ సమయంలో భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ.. ఇంకా నిప్పుల కొలిమిలా మండిపోతోంది. ఈ సమయంలో భానుడి భగభగలకు అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాగా, గడిచిన మూడు వారాల నుంచి రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. తీవ్రమైన వడగాల్పులతో జనాలు ఉడికిపోతున్నారు. రుతుపవనాలు విస్తరించే వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలు నమోదవుతాయని వాతావరణా అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!