సంక్రాతికి దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు అలెర్ట్!

Updated on: Jan 09, 2026 | 9:54 PM

సంక్రాంతి వేళ ఏపీలో వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా పండుగ రోజుల్లో వర్షాలు, ఈదురు గాలులు, సముద్రం అలజడి ఉంటుందని తెలిపింది. ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, తీరప్రాంతాలకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ప్రభావం ఉంటుంది.

సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు వర్షాలు పలకరించనున్నాయి. దీంతో పండుగ రోజుల్లో వర్షాలు, ఈదురు గాలులు, సముద్రం అలజడి వంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం ఉందని.. ఒకవేళ పరిస్థితులు మారితే తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం మీదుగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి శుక్రవారం సాయంత్రం శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దాంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటమునిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది.నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కూడా శనివారం, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి అంటున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం, మచిలీపట్నం, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా డిసెంబర్ 31తో ఈశాన్య రుతుపవనాల సీజన్ ముగుస్తుంది. వాతావరణ శాస్త్రం ప్రకారం జనవరి, ఫిబ్రవరి నెలల్లో బంగాళాఖాతంలో వాయుగుండాలు, తుపాన్లు చాలా అరుదుగా ఏర్పడతాయి. అయినప్పటికీ ఈసారి అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఆధార్‌’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది

అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..

సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ

రోబోలకు నొప్పి తెలుస్తుంది.. సైంటిస్టుల ప్రయోగం సక్సెస్‌

హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. 37శాతం డేంజర్ జోన్‌లోనే