ఏపీలో ఈసారి నెలముందే ఇంటర్ పరీక్షలు
ఏపీ ఇంటర్ పరీక్షా విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు మార్చిలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈసారి సీబీఎస్‌ఈతో పాటుగా ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించాలని ఏపీ ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అంటే నెల ముందుగానే పరీక్షలను పూర్తి చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఏప్రిల్‌లోనే సెకండ్ ఇయర్ సిలబస్ బోధించేలా తరగతులు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈసారి ఇంటర్ పరీక్షల విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇంతకు ముందు లాంగ్వేజ్ పరీక్షలు ముందుగా నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది గ్రూప్ సబ్జెక్టుల పరీక్షలు ముందు జరగనున్నాయి. ఎంపీసీ గ్రూపు వారికి మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వారికి బోటనీ, జువాలజీ పరీక్షలు అయ్యాక.. చివరలో లాంగ్వే జ్ పరీక్షలు జరుగుతాయి. అనంతరం ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు ప్రారంభమవుతాయి. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు బైసీపీ, ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టుల పరీక్షలు జరిగేవి. ఈ ఏడాది కొత్తగా ఎంబైపీసీ గ్రూపును తీసుకురావడంతో.. ఎంపీసీ విద్యార్థులు కూడా బయాలజీ చదివే అవకాశం వచ్చింది. అందువల్ల ఒకే రోజు రెండు పరీక్షలు రాయడం సాధ్యం కాదు గనుక రోజుకు ఏదో ఒక సబ్జెక్టు పరీక్షే నిర్వహిస్తారు. కాగా, ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరలో నిర్వహించాలా? రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Donald Trump: కాలు తీసేయాల్సి రావొచ్చు..ట్రంప్ హెల్త్‌పై డాక్టర్ సంచలనం
వీధి శునకాలపై ప్రేమ.. చెంప దెబ్బలకూ వెనకాడని మహిళ
పాపకు కానుకగా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్! వైరల్‌గా వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

