క్యాంటిన్ టీ తాగి.. కుప్పకూలిన మెడికో
రాంచీలోని రిమ్స్ గైనకాలజీ విభాగం వైద్య విద్యార్థిని ఒకరు అనుమానాస్పద స్థితిలో తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఆస్పత్రి క్యాంటిన్ నుంచి తెచ్చిన టీ తాగుతూనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిందని అధికారులు తెలిపారు. కాగా, ఆమెపై విష ప్రయోగం జరిగి ఉండొచ్చని ఎయిమ్స్ ప్రతినిధి శనివారం అనుమానం వ్యక్తం చేశారు.
గురువారం రాత్రి రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలోని వార్డులో 25 ఏళ్ల వైద్య విద్యార్థిని.. సీనియర్ డాక్టర్లతో బాటు పేషంట్లను చూసింది. ఆ పని కాగానే.. ఆమె టేబుల్ మీద కూర్చొని.. క్యాంటిన్ నుంచి ఫ్లాస్క్‌లో తెచ్చిన టీని గ్లాసులోకి వంపుకుని రెండు సార్లు చప్పరించింది. అయితే.. టీ దుర్వాసన రావటంతో బాటు రుచిగా లేకపోవటంతో.. అదే మాటను తోటి విద్యార్థులకు చెబుతూ.. టీ గ్లాసు పక్కన పెట్టేసింది. దీంతో.. మిగిలిన వారు ఆ టీ జోలి పోలేదు.ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో, అక్కడి తోటి మెడికోలు ఆమెను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందించారు. బాధిత విద్యార్థిని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోందని, వచ్చే 48 గంటలు చాలా కీలకమని రిమ్స్ అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఫ్లాస్క్‌తోపాటు అక్కడున్న ఇతర వస్తువులన్నిటినీ సీజ్ చేసి, టాక్సికాలజీ పరీక్షలకు పంపించారు. క్యాంటిన్ సీజ్ చేసి, టీ ఫ్లాస్క్ తీసుకువచ్చిన ఉద్యోగిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇది విష ప్రయోగంగా కనిపిస్తోందని, అయితే.. ల్యాబ్ రిపోర్ట్ వస్తే గానీ ఏమీ చెప్పలేమని రిమ్స్ ప్రతినిధి డాక్టర్ రాజీవ్ రంజన్ చెప్పారు. వర్షాకాలంలో తరచూ పట్టి పీడించే సమస్య ఫుడ్ పాయిజనింగ్. తేమతో కూడిన వాతావరణం ఆహార పదార్థాల్లో బ్యాక్టీరియా పెరిగేందుకు అనుకూలిస్తుందని నిపుణులు అంటున్నారు అలాగే మనం తీసుకునే ఆహారంలో కల్తీ జరిగినా.. లేక అపరిశుభ్ర వాతావరణంలో తయారైనా లేక ఎక్కువ కాలం నిల్వ చేసినా.. అది మన ఆరోగ్యానికి హాని చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. పొరపాటుగా వీటిని తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ప్రమాదముంటుందని చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్‌లో మృతి.. ఇప్పుడు అంత్యక్రియలు
దెయ్యం పట్టిందని భర్తను చితక్కొట్టిన భార్య.. ఆ తరువాత సీన్ ఇదే
భార్య ‘బంగారం’ కోసం 18 టన్నుల చెత్తను జల్లెడ పట్టాడు
ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న డోంట్ మిస్
Upasana Konidela: ఈ స్థాయి ఎవరో ఇచ్చింది కాదు.. నాకు నేనుగా సాధించుకున్నది
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

