Viral Video: ఆంజనేయుడి గుడి కడదామని పునాదులు తవ్వుతుండగా అద్భుతం..!
ఊరంతా జమ కూడారు. మంచి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టుకుందామని.. మంచిదని భావించారు. ఇందుకోసం విరాళాలు కూడా సేకరించారు. గ్రామ సర్పంచ్ తన పూర్వికుల భూమిని ఆలయ నిర్మాణం కోసం దానమిచ్చారు. అయితే ఇందుకోసం పునాదులు తవ్వుతుండగా ఏం బయటపడ్డాయో తెలుసా..?
మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో గురువారం ఒక అరుదైన ఘటన వెలుగుచూసింది. గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్థులు సంకల్పించారు. ఇందుకోసం అందరూ చందాలు వేసుకున్నారు. టెంపుల్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్ తన పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని అందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనుల కోసం పునాదులు తవ్వుతుండగా.. ఆశ్చర్యకరంగా… ప్రాచీన కాలానికి చెందిన బంగారు నాణేలు బయటపడ్డాయి. సగౌరియా పురా గ్రామంలో జరుగుతున్న తవ్వకాల సమయంలో నాణేలు లభించడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకింది. గ్రామస్తులు అక్కడికి భారీగా చేరుకుని ఆ నాణేలను ఆసక్తిగా పరిశీలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సుమారు 50 నుండి 60 బంగారు నాణేలు బయటపడ్డాయని గ్రామ సర్పంచ్ సంతోషీలాల్ ఢాకడ్ తెలిపారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

