Viral Video: ఆ పనిమనిషి చేసిన పనికి సోషల్ మీడియా షేక్!
భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇంట్లో పనులు చేసుకునే అవకాశం చాలా తక్కువగా ఉండటంతో కొందరు.. వయోభారంతో ఇంటి పనులు చేసుకోలేక కొందరు సహాయకులను పెట్టుకుంటారు. ఓ పనిమనిషి చాలా బాధ్యతాయుతంగా ఆలోచించింది. కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఏమాత్రం తీసిపోకుండా తన యజమానిని లీవ్ కావాలని కోరుతూ వాట్సప్‌లో మెసేజ్ పంపింది. ఇంగ్లీషులో మెసేజ్ చేసి మరీ ఆమె సెలవు అడిగిన తీరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన పనిమనిషి సెలవు అడిగే విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె వాట్సాప్ చాట్ వైరల్ అవుతోంది. దీనిలో పనిమనిషి ఇంగ్లీషులో సెలవు కోరుతూ మెసేజ్ పంపుతుంది. ఈ పోస్ట్ చూసి, చాలా మంది నవ్వుకుంటున్నారు. దానికి ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా సెలవు తీసుకోవాల్సినప్పుడు తాను చాలా స్పష్టమైన, ప్రొఫెషనల్ ఇంగ్లీషులో మెసేజ్ పంపుతానని ఆ మహిళ రాసింది. తన పనిమనిషి తాను ఆఫీసులో పనిచేసే వారి కంటే సెలవు తీసుకోవడంలో ఎక్కువ ప్రొఫెషనల్ అని ఆమె చెప్పింది. పనిమనిషి రాసిన మెసేజ్ ఆమె పదేళ్ల కుమార్తె టైప్ చేసిందని, ఆమె ప్రొఫెషనల్ భాషను చూస్తుంటే అది ఆఫీస్ ఈమెయిల్ లాగా అనిపిస్తుందని తెలిపింది. ఆమె తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు. అందులో ‘నాకు బాగాలేదు. నాకు జలుబు, గొంతు నొప్పి ఉంది. కాబట్టి, నేను ఈ రోజు పనికి రావటం లేదు’ అని ఇంగ్లీషులో రాసి ఉంది.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

